Sidharth Shukla: సిద్ధార్థ్‌కు నివాళి తెలుపను: షెహనాజ్ సోదరుడు

Sidharth Shukla: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణంతో ప్రేయసి షెహనాజ్ తట్టుకోలేకపోతోంది. నిన్న (శుక్రవారం) ముంబైలో కుటుంబసభ్యులు, బాలీవుడ్ టీవీ నటుల అశ్రునివాళి మధ్య సిద్ధార్థ్ అంత్యక్రియలు ముగిశాయి. అనంతరం సిద్ధార్థ్ గర్ల్‌ఫ్రెండ్ షెహనాజ్ గిల్ సోదరుడు షెహ్‌బజ్ బడేషా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. చివరిగా వీడ్కోలు చెబుతూ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెటిజన్లను, అభిమానులను ఆకట్టుకుంది.
'మేరా షేర్.. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు.. అందుకే నీకు నివాళి అర్పించను. ఇప్పుడే కాదు.. ఇక ఎప్పటికీ నివాళి తెలుపలేను. నేను నీలా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం ఇదే నాకల. త్వరలోనే ఈ కలను నిజం చేస్తా.. లవ్ యూ' అంటూ షెహ్‌బజ్ తన స్నేహితుడికి హృదయపూర్వక నివాళి అర్పించాడు. షెహనాజ్, సిద్ధార్ధ్‌ల రిలేషన్‌లో వీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా మారారు. కాగా సిద్ధార్థ్ అంత్యక్రియలకు షెహనాజ్ గిల్, ఆమె తల్లి కూడా హాజరైన సంగతి తెలిసిందే. కారులో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సోదరిని ఓదారుస్తూ కనిపించాడు షెహ్‌బజ్.
MERA SHER 🦁 U R ALWAYS WITH US AND U WILL B ALWAYS 🙂WILL TRY TO BECOME LIKE U. IT IS A DREAM NOW 🙂 AND THIS DREAM WILL COME TRUE SOON 😔 I WILL NOT SAY RIP BECAUSE U R NOT LOVE U 😍 @sidharth_shukla pic.twitter.com/rOnJsPkjlC
— Shehbaz Badesha (@ShehbazBadesha) September 3, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com