Chiranjeevi: సినీ పరిశ్రమలో నేను పెద్దను కాను: చిరంజీవి

Chiranjeevi: చిత్రపురి కాలనీలో చిరంజీవి నూతన గృహ సముదాయాన్ని ప్రారంభించారు. లబ్దిదారులకు ఇంటి పత్రాలు, తాళాలు అందజేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇండస్ట్రీలో తాను పెద్దను కానని, కొందరు చిన్న వాళ్లుగా చెప్పుకుంటూ తనను పెద్ద వాడిని చేస్తున్నారని అన్నారు. కార్మికులకు అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా తాను తోడు ఉంటానని చెప్పారు. ఇలా సినీ కార్మికులకు గృహ సదుపాయం ఏ ఇండస్ట్రీలో లేదని, నటుడు ప్రభాకర్ దూరదృష్టి వల్లే కార్మికుల సొంతింటి కల సాకారం అయ్యిందని తెలిపారు.
ఇకపోతే ఇటీవల విడుదలైన చిరు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయాయి. కమర్షియల్‌గా హిట్ అందుకోని చిరు దృష్టి అంతా ఇప్పుడు సంక్రాంతి విడుదలవ్వబోయే వాల్తేరు వీరయ్యపైనే ఉంది. కొల్లి బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జనవరి 13న రిలీజ్ కానుంది.
ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. మాస్ మహరాజ రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ చిత్రంలో. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మెగా ఫ్యాన్స్‌ని అలరిస్తుందో లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com