Iconic moment: 'నాటు నాటు' సాంగ్ కు మైఖేల్ డగ్లస్ డ్యాన్స్

స్క్రీన్ లెజెండ్, నిర్మాత మైఖేల్ డగ్లస్ 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో 2022లో సంచలనం సృష్టించిన తెలుగు మూవీ ఆర్ఆర్ఆర్ లోని ప్రసిద్ధ పాట నాటు నాటుకి డ్యాన్స్ చేశారు. ఆయన నవంబర్ 28న ప్రఖ్యాత సత్యజిత్ రే ఎక్సలెన్స్ ఇన్ ఫిల్మ్ లైఫ్‌టైమ్ అవార్డును కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే IFFI ప్రత్యేక ఇంటరాక్టివ్‌లో మైఖేల్ వేదికపై 'ఆర్ఆర్ఆర్(RRR)' ఆస్కార్-విజేత పాట 'నాటు నాటు'కి తన కాలు కదుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
'నాటు నాటు' ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ పాట. ఇది ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా 'గోల్డెన్ గ్లోబ్ అవార్డు'ను, ఉత్తమ పాటగా క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డును కూడా గెలుచుకుంది. ఇదిలా ఉండగా తాజాగా 79 ఏళ్ల నటుడు నిర్మాత శైలేంద్రతో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ అందర్నీ ఆకర్షించాడు. ఈ సమయంలో మైఖేల్ తెల్లటి చొక్కా, నీలిరంగు బ్లేజర్, బూడిద రంగు ప్యాంటు ధరించాడు.
నవంబర్ 28న గోవాలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును మైఖేల్ అందుకున్నారు. ఆయన 'ది ఘోస్ట్ అండ్ ది డార్క్‌నెస్', 'ఫాటల్ అట్రాక్షన్', 'వాల్ స్ట్రీట్', 'ఎ పర్ఫెక్ట్ మర్డర్' వంటి అనేక హాలీవుడ్ హిట్‌లతో పాటు అనేక ఇతర చిత్రాలతో పాటు, చలనచిత్ర నిర్మాణ ప్రపంచానికిచేసిన విశేష సేవలకు గాను ఆయన్ని ఈ సందర్భంగా సత్కరించారు. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌ని అందుకోవడానికి ముందుకు వచ్చిన ఆయన ప్రేక్షకుల నుండి స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నాడు.
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ అవార్డును మైఖేల్ కి అందజేశారు. ఆయన, ఆయుష్మాన్ ఖురానా పరిచయ ప్రసంగం చేసి అవార్డును అందుకోవడానికి డగ్లస్‌ను వేదికపైకి ఆహ్వానించారు. తాను అవార్డు తీసుకునే క్రమంలో.. “నేను దీన్ని PM మోడీ, మంత్రి అనురాగ్ ఠాకూర్, మంత్రి L మురుగన్, నా మంచి స్నేహితుడు శైలేంద్ర సింగ్‌తో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ అవార్డును అందుకోవడం గర్వకారణం. ప్రతిష్టాత్మకమైన విజేతల సమూహంలో చేరినందుకు నేను వినయపూర్వకంగా భావిస్తున్నాను అని చెప్పారు. “నా కెరీర్‌లో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులను నేను గుర్తించాలనుకుంటున్నాను. నా తొలి మార్గదర్శకులు, లెక్కలేనంత మంది సాంకేతిక నిపుణులు-గత 55 ఏళ్లలో మీ మార్గదర్శకత్వం లేకుండా నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాను. నేను దీన్ని నా తండ్రి కిర్క్‌కి అంకితం చేస్తున్నాను. ఈరోజు నా కొడుకు, భార్య నాతో ఉన్నారు. మీ మద్దతు, సహనానికి ధన్యవాదాలు” అని కేథరీన్ జీటా-జోన్స్‌ను వివాహం చేసుకున్న తరుణాన్ని కూడా డగ్లస్ జోడించారు.
Hollywood star Michael Douglas dancing on Oscar-winning #NaatuNaatu song at #IFFI2023#michaeldouglas #RRR pic.twitter.com/6SmRQHHhgo
— $@M (@SAMTHEBESTEST_) November 28, 2023
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com