NTR : రిషబ్ ప్లాన్ చేస్తే ప్రీక్వెల్ లో యాక్ట్ చేస్తా : ఎన్టీఆర్

NTR : రిషబ్ ప్లాన్ చేస్తే ప్రీక్వెల్ లో యాక్ట్ చేస్తా : ఎన్టీఆర్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి కర్నాటక రాష్ట్రం కొల్లూరులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరి వెంట కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం ఉన్నారు. అయితే, ఆలయ ఆవరణలో ఎన్టీఆర్ కన్నడ మీడియాతో మాట్లాడారు. ‘రిషబ్‌ శెట్టితో కలిసి పలు ఆలయాలను సందర్శించడం ఆనందంగా ఉంది. ఆలయంలో సినిమా అప్‌డేట్‌లపై స్పందించాలని లేదు. దానికి వేరే కార్యక్రమాలు ఉంటాయి’అని చెప్పుకొచ్చారు.‘కాంతార’ ప్రీక్వెల్‌లో మీరు యాక్ట్‌ చేస్తున్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. నిజమేనా? అంటూ ఓ రిపోర్టర్ అడగగా.. ‘రిషబ్ శెట్టినే దానిని ప్లాన్‌ చేయాలి. ఆయన ప్లాన్‌ చేస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా’ అంటూ ఎన్టీఆర్ బదులిచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags

Next Story