కాఫీ విత్ కరణ్ కి రమ్మని కబురందితే..: నానీ రియాక్షన్

కాఫీ విత్ కరణ్ కి రమ్మని కబురందితే..: నానీ రియాక్షన్
న్యాచురల్ స్టార్ నాని వివాదాలకు దూరంగా ఉంటాడు. అనవసరంగా ఏదీ స్లిప్ అవడు.

న్యాచురల్ స్టార్ నాని వివాదాలకు దూరంగా ఉంటాడు. అనవసరంగా ఏదీ స్లిప్ అవడు. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబుల్ కాంక్లేవ్ కు ప్రత్యేక అతిధిగా నానీ హాజరయ్యాడు. ఒకవేళ కాఫీ విత్ కరణ్ టాక్ షోకి మీకు ఆహ్వానం అందితే వెళతారా అని అంటే.. నిర్మొహమాటంగా నో చెబుతానని చెప్పేశాడు. సున్నితంగానే తిరస్కరిస్తాను, అంతకు మించి ఇంకేం లేదన్నాడు. కరణ్ ఫోన్ చేస్తాడని, ఒకవేళ కలిసే సందర్భం వస్తే సంతోషంగా సినిమా కబుర్లు చెప్పుకుని బయటికి వస్తాను. అంతే కానీ కాఫీకి మాత్రం వెళ్లే ప్రసక్తే లేదన్నాడు.

నాని ఇంత ఓపెన్ గా బాలీవుడ్ బిగ్గెస్ట్ టాక్ షో గురించి మాట్లాడడం విశేషమే. ఎందుకంటే సెలబ్రెటీలందరికీ ఈ షోలో పాల్గొనడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తారు. అయితే ఈ మధ్య పలువురు ఈ ప్రోగ్రాంకి వెళ్లి సోషల్ మీడియాలో మీమ్స్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా రణ్వీర్ సింగ్, దీపికా పదుకునేల ఎపిసోడ్ ఆన్ లైన్ లో పెద్ద చర్చకు దారి తీసింది.

దీపిక గత జీవితంలోని బాయ్ ఫ్రెండ్స్ గురించి, కరణ్ అడిగిన విధానం గురించి నెటిజెన్లు పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. ఇలాంటివి గతంలోనూ జరిగాయి. ఈ షోనే అంత కొంచెం కాంట్రావర్షియల్ షో. కరణ్ ఎక్కువగా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ట్రాప్ లో పడ్డవాళ్ళు అనుకోకుండానే, అది షో అందరూ చూస్తున్నారన్న ధ్యాసలో లేకుండా అన్నీ నిజాలు చెప్పేస్తారు. తరువాత ట్రోల్స్ బారిన పడతారు. అయినా బాలీవుడ్ లో ఇదేం కొత్త కాదు. కానీ టాలీవుడ్ సెలబ్రెటీలు కాస్త వివాదాలకు దూరంగా ఉంటారు.

జై భీంకు నేషనల్ అవార్డు రాకపోవడం పట్ల నాని మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. దానికి అన్ని అర్హతలు ఉన్నాయని, అయితే కమిటీ అలా ఎందుకు నిర్ణయం తీసుకుందో తెలియదు అని అన్నాడు. రామ్ చరణ్ తర్వాత ఇండియా టుడే నుంచి రౌండ్ టేబుల్ కి ఆహ్వానం అందుకున్న రెండో సెలబ్రిటీ నానినే. డిసెంబర్ 7న హాయ్ నాన్న విడుదల కాబోతున్న తరుణంలో ప్రమోషన్లలో విరివిగా పాల్గొంటున్నాడు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నానీతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story