పవన్ కళ్యాణ్ సినిమాకి కథ రాయాల్సి వస్తే..: విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ రచయిత, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనో డైనమెంట్ అంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తారు. బుల్లి తెరపై ఆలీ హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాకి కథ రాసే అవకాశం వస్తే ఏ కథని ఎంచుకుంటారు అని అడగ్గా.. ఆయన ఒక డైనమైట్. ప్రత్యేకంగా కథ రాయడం ఎందుకు. ఆయన నటించిన సినిమాల్లో నుంచి కొన్ని సీన్స్ తీసుకుంటే కథ రెడీ అయిపోతుంది.
ఆయనను చూడడానికే జనం వచ్చేస్తారు. ఆయనే ఓ పెద్ద డైనమైట్ కథ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అని విజయేంద్ర ప్రసాద్ తన అభిప్రాయాన్ని తెలిపారు.
వెంటనే ఆలీ మరి మహేష్ బాబుకో అని అడగ్గా ఆయనకి కథ రాయాలంటే పూరీ జగన్నాథ్ దగ్గరకు వెళ్లాల్సిందే అని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com