Ilaiyaraaja: ఇళయరాజా డిఫరెంట్ న్యూ ఇయర్ విషెస్.. ఎమోషనల్ అయిన ఫ్యాన్స్..

Ilaiyaraaja (tv5news.in)
Ilaiyaraaja: మ్యూజిక్ మేస్ట్రో ఇళయారాజా.. ఆయన కెరీర్‌లో ఎన్నో వేల సినిమాలకు సంగీతాన్ని అందించారు. 20,000కు పైగా కాన్సర్ట్స్‌లో పాల్గొన్నారు. 7000కు పైగా పాటలను కంపోజ్ చేశారు. ఇదీ ఆయన సంగీత ప్రస్థానం. అయినా కూడా ఇళయరాజా ఆఫ్ స్క్రీన్.. ఆయన అభిమానులతో ఇంటరాక్ట్ అయిన సందర్భాలు చాలా తక్కువే ఉన్నాయి. అలాంటి ఇళయరాజా మొదటిసారి ఆయన మనసుతో పాట పాడి అభిమానులకు న్యూ ఇయర్ విషెస్‌ను తెలియజేశారు.
గత కొంతకాలంగా ఇళయరాజా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదని సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆయన.. దాదాపు వంద సినిమాలకు రెమ్యునరేషన్ లేకుండానే పనిచేశారు. ఇటీవల కాస్త సినిమాలో మ్యూజిక్ డైరెక్షన్‌కు దూరంగా ఉంటున్నారు. అందుకే ఆయన ఆరోగ్యంపై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఆ అనుమానాలు అన్నింటికి చెక్ పడేలా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సెలబ్రిటీలు అందరూ న్యూ ఇయర్‌కు తమ అభిమానులకు స్పెషల్‌గా విషెస్ చెప్పడం అలవాటుగా మారింది. మరి ఇళయరాజా లాంటి మ్యూజిక్ మేస్ట్రో ఎలా విషెస్ చెప్తే ఆయన అభిమానులు సంతోషిస్తారు అని ఆలోచించిన ఆయన ఓ పాటతో వారికి విషెస్ తెలిపారు. 1982లో ఇళయరాజా సంగీతం అందించిన 'సకలకళా వల్లవన్' అనే చిత్రం నుండి 'ఇళమై ఇదో ఇదహో' అనే పాటను పాడి వీడియోను రికార్డ్ చేసి అందరినీ సంతోషపెట్టారు. దీంతో ఆయన అభిమానులు ఇళయరాజా పాటను వింటూ ఎమోషనల్‌గా కామెంట్స్ చేశారు.
Wish you all happy new year 2022.#HappyNewYear2022 pic.twitter.com/cSlW4BKQGa
— Ilaiyaraaja (@ilaiyaraaja) December 31, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com