Ilayaraja : ఇళయరాజాకు ఘోర అవమానం

Ilayaraja :  ఇళయరాజాకు ఘోర అవమానం
X

ఇసైజ్ఞాని, ఇండియన్ సినిమా మ్యూజిక్ ను కొన్నాళ్ల పాటు శాసించిన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఘోర అవమానం జరిగింది. అది కూడా ఓ గుడిలో కావడం విశేషం. స్వతహాగా వీర హిందూ భక్తుడైన ఇళయరాజా తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ మాత గుడికి వెళ్లాడు. ఆయన వస్తున్నాడని తెలిసి ఘన స్వాగతమే పలికినా.. ఆయన్ని గర్భగుడిలోనికి రాకుండా అడ్డుకున్నారు బ్రాహ్మణులు. అక్కడ జియర్ స్వామీజీ కూడా ఉండటం గమనార్హం.

నిజానికి ఇళయరాజా ‘దివ్య పాశురం’ అనే పేరుతో కొన్ని భక్తిగీతాలను స్వరపరిచాడు. వాటిని రిలీజ్ చేయాలనే గుడికి వచ్చాడు. దర్శనం, ప్రత్యేక పూజల తర్వాత విుడదల చేయాలనుకున్నాడు. కానీ ఆయన్ని గర్భగుడిలోనికి అనుమతించలేదు. దీంతో చేసేదేం లేక గుడి అర్థమండపం మెట్ల దగ్గర నుంచే పూజలు నిర్వహించుకున్నారు.

ఇళయరాజా జన్మతహ దళితుడు కావడం వల్లే గర్భగుడిలోనికి అనుమతించలేదని తమిళనాట దళిత సంఘాలు మండిపడుతున్నాయి. దేశం గర్వించదగ్గర సంగీత దర్శకుడిని కులం పేరుతో గుడిలోపలికి రానివ్వకపోవడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ని గర్భగుడిలోనికి రాకుండా అడ్డుకున్న వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.

Tags

Next Story