Ileana Pregnancy: గర్భంతో ఇలియానా.. భర్త ఎవరో చెప్పలేదు..!

పోకిరీ, దేవదాసు, జల్సా లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది ఇలియానా. దాదాపు 15 సంవత్సరాలకు పైగా తెలుగు, హిందీ భాషలలో తన సత్తాను చాటింది. తాజాగా అమ్మతనాన్ని అనుభవించడానికి రెడీ అయింది. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఇలియానా సోషల్ మీడియాలో తన అభిమానులను పలకరించింది. మాతృత్వాన్ని ఎలా ఆనందిస్తున్నదో వెళ్లడించింది.
శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లోని తన అభిమానులతో చాటింగ్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు దాదాపు జవాబులను ఇచ్చింది. గర్బాధారణ, బరువు పెరగడంపై ప్రశ్నలను అడిగారు అభిమానులు. ఏ ఆహార పదార్ధాలను తినడానికి ఇష్టపడుతున్నారని ప్రశ్నించారు. అయితే తాను భారతీయ ఆహారం కోసం ఎదురుచూస్తున్నానని ముంబై ఫుడ్ ను మిస్ అవుతున్నట్లు చెప్పింది.
ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంచింది. ఇటీవల బేబీమూన్ లో ఓ మిస్టరీ మ్యాన్ తో సమయం గడిపిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో అతని ముఖం కాకుండా చేతులు మాత్రమే కనిపించాయి. ఇరువురికీ వెడ్డింగ్ ఉంగరాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com