Ileana D'Cruz: ఆ సంఘటనల వల్లే చనిపోవాలనుకున్నా: ఇలియానా

Ileana DCruz (tv5news.in)

Ileana D'Cruz (tv5news.in)

Ileana D'Cruz: తాను గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మాట నిజమే అని స్పష్టం చేసింది ఇలియానా.

Ileana D'Cruz: ఎంత ఫేమ్ ఉన్నా.. ఎంత సంపాదించినా.. చాలామంది జీవితాల్లో చనిపోవాలి అని నిర్ణయించుకునే క్షణాలు కొన్ని ఉంటాయి. అలాగే సినీ సెలబ్రిటీల జీవితాల్లో కూడా ఉంటాయి. కానీ అందరూ వాటి గురించి ధైర్యంగా బయటపెట్టరు. సైజ్ జీరో బ్యూటీ ఇలియానా మాత్రం తాను ఏ సమస్యల వల్ల అలా ఆలోచించేదో ఇటీవల బయటపెట్టింది.

టాలీవుడ్‌లో ఒకప్పుడు తన జీరో సైజ్ నడుముతో ఓ ఊపుఊపిన నటి ఇలియానా. ఎందరో స్టార్ హీరోలతో కలిసి నటించింది. హీరోయిన్‌గా ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ భామ తెలుగులో కనిపించి చాలాకాలమే అయ్యింది. పూర్తిగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి అక్కడే సెటిల్ అయిపోయింది. ఇక తాజాగా ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై నటి స్పందించింది.


తాను గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మాట నిజమే అని స్పష్టం చేసింది ఇలియానా. కానీ అది బాడీ షేమింగ్ వల్ల కాదని తెలిపింది. 12 వయసు నుండే తనకు శరీర సమస్యలు ఉన్నాయని, కాబట్టి ఆ విషయంలో తాను జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. ఆత్మహత్య చేసుకోవడానికి అది కారణం కాదని, అప్పట్లో జరిగిన కొన్ని సంఘటన వల్లే డిప్రెషన్‌లోకి వెళ్లి, చనిపోవాలనుకున్నానని బయటపెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story