Ileana : అందమైన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసిన ఇలియానా

హీరోయిన్ ఇలియానా తరుచూ ఫ్యామిలీలో ఎక్కువ సమయం గడుపుతోంది. భర్త మైఖేల్ డోలన్, కుమారుడులో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఆమె కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్ ఇటీవలే ఫస్ట్ బర్త్ డే జరుపుకొన్నాడు. కోవా పుట్టిన రోజు వేడుక నుండి అందమైన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసారు. కోవా ఫీనిక్స్ తన తల్లిదండ్రులతో సరదాగా గడుపుతూ ఇలియానా ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇలియానా.. ఎప్పటికప్పుడు ఇన్స్టా వేదికగా తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇలియానా పాత వీడియో ఒకటి షేర్ చేసింది. భర్తను మిస్ అయినప్పుడు తాను ఈ మనోహరమైన వీడియోలన్నింటినీ చూసి సర్ది చెప్పుకుంటానని వెల్లడించింది. “అతడు లేట్ నైట్ డ్యూటీలతో ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడైతే, బిజీగా ఉండే వ్యక్తి అయితే.. అతడిని మిస్సయినట్టు భావిస్తే, మీరు అతని నుండి పొందిన అన్ని అందమైన వీడియోలను చూడండి" అని క్యాప్షన్ ఇచ్చింది ఇల్లి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com