Upasana Kamineni: ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన ప్రత్యేక దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు: ఉపాసన

Upasana Kamineni: ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన ప్రత్యేక దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు: ఉపాసన
X
Upasana Kamineni: నేను వేసుకుంటున్న దుస్తులు నాకు చాలా కంఫర్ట్‌గా ఉంటున్నాయి. ఇక వేరే దుస్తులు ధరించాల్సిన అవసరం ఏముంది.

Upasana: నేను వేసుకుంటున్న దుస్తులు నాకు చాలా కంఫర్ట్‌గా ఉంటున్నాయి. ఇక వేరే దుస్తులు ధరించాల్సిన అవసరం ఏముంది. మరి కొద్ది నెలల్లో డెలివరీకి సిద్దంగా ఉన్నా బేబీ బంప్ పెద్దగా కనిపించకపోవడం, అన్ని వేడుకలకు హాజరవడం, ఇతర దేశాలకు కూడా ట్రావెల్ చేయడం, అన్నింటినీ ఆస్వాదించడం వంటివి చూస్తుంటే నెటిజన్లకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయితే ఉపాసన మాత్రం తాను డాక్టర్ చెప్పినట్లే నడుచుకుంటున్నానని తెలిపారు. డైట్ కూడా చెప్పినట్లుగానే ఫాలో అవుతున్నానని అన్నారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని తినాలి.. అయితే అది ఇద్దరి కోసం కాదు, నా కోసం మాత్రమే అని ఆమె అన్నారు. మీ వ్యక్తిత్వం అన్నిటికంటే ఎక్కువగా మాట్లాడుతుందని నేను భావిస్తున్నాను. మీరు జీవితంలో ఏ దశలో ఉన్నా తెలివిగా, ఆత్మవిశ్వాసంతో ఉండటం అవసరం అని ఆమె అన్నారు. ఉపాసన కొణిదెల, రామ్ చరణ్ వివాహం జరిగి దశాబ్దం దాటింది. వీరిద్దరూ 2012లో హైదరాబాద్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Tags

Next Story