IMDB Most popular Movies 2021 : టాప్ 10 మూవీస్ ఇవే.. టాప్ వన్‌లో 'జై భీమ్'

IMDB Most popular Movies 2021: ఈ ఏడాది చిత్రపరిశ్రమకు మిశ్రమ ఫలితాలు లభించాయి. కరోనా వలన కొన్ని సినిమాలు థియేటర్లు, మరికొన్ని చిత్రాలు ఓటీటీల్లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరికొన్నిరోజుల్లో ఈ ఏడాది ముగియనుండటంతో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ 2021 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల లిస్టుని రిలీజ్ చేసింది. ఇందులో టాప్ లో సూర్య హీరోగా నటించిన 'జై భీమ్' కి ఫస్ట్ ప్లేస్ దక్కింది. అయితే ఇందులో ఒక్క తెలుగు సినిమా లేకపోవడమం గమనార్హం.
ఈ జాబితాలో ఉన్న టాప్ 10 మూవీస్ ఇవే.. !
1.జై భీమ్ (సూర్య - కోలీవుడ్)
2. షేర్ షా(సిద్దార్థ్ మల్హోత్ర - బాలీవుడ్)
3. సూర్యవన్షీ (అక్షయ్‌కుమార్ - బాలీవుడ్)
4.మాస్టర్ (విజయ్ - కోలీవుడ్)
5.సర్దార్ ఉద్దమ్ (విక్కీ కౌశల్ - బాలీవుడ్)
6.మీమీ (కృతిసనన్ - బాలీవుడ్)
7.కర్ణన్ (ధనుష్ - కోలీవుడ్)
8.షిద్దత్ (సన్నీకౌశల్ - బాలీవుడ్)
9.దృశ్యం-2 (మోహన్‌లాల్ - మలయాళం)
10.హసీనా దిల్‌రూబా (తాప్సీ - బాలీవుడ్)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com