Sravana Bhargavi: రౌడీ స్టార్ పక్కన హీరోయిన్‌గా: ఓ ఇంటర్వ్యూలో శ్రావణ భార్గవి..!!

Sravana Bhargavi: అర్జున్ రెడ్డి అనగానే విజయ్ దేవరకొండ పేరు గుర్తుకు వచ్చేలా పేరు సంపాదించుకున్నాడు రౌడీ స్టార్.. గీత గోవిందంతో అమ్మాయిల మనసు దోచుకున్నాడు. అతడి స్టైల్, డ్రెస్ సెన్స్‌తో యూత్‌ని ఆకట్టుకుంటున్న రౌడీ విజయ్.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ పాన్ ఇండియా మూవీ ఐదు భాషల్లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. హీరోగానే కాకుండా నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. ఇక ఇండస్ట్రీలోని హీరోయిన్లు కూడా విజయ్‌ని, అతడి నటనని ఇష్టపడే వాళ్లు ఉన్నారు.
తాజాగా ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. మరో సింగర్ హేమ చంద్రని పెళ్లి చేసుకుని ఒక పాపకు తల్లైన శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా వివిధ రంగాల్లో రాణిస్తున్న శ్రావణ భార్గవికి నెటిజన్స్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది.. మీకు హీరోయిన్‌గా అవకాశం వస్తే ఎవరితో నటిస్తారు అని అడగుతూనే.. మీ భర్త హేమచంద్రతో నటిస్తానని మాత్రం చెప్పకండి అని ఆమెని అడిగారు..
దాంతో ఆమె వెంటనే నాకు ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ.. హీరోయిన్‌గా ఛాన్స్ వస్తే అతడితో డ్యూయెట్ పాడేస్తా అని తెలిపింది. అలాగే తనకు హీరోయిన్స్‌లో సాయిపల్లవి అన్నా, ఆమె నటన అన్నా చాలా ఇష్టం అని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com