Bhimlanayak vs KGF 2: తెలుగు రాష్ట్రాల్లో యశ్ హవా.. భీమ్లానాయక్ ని మించి కెజీఎఫ్ 2 బిజినెస్..

Bhimlanayak vs KGF 2: తెలుగు రాష్ట్రాల్లో యశ్ హవా.. భీమ్లానాయక్ ని మించి కెజీఎఫ్ 2 బిజినెస్..
Bhimlanayak vs KGF 2: ప్రాంతీయ అభిమానాన్ని పక్కన పెట్టి మరీ కన్నడ హీరోకి పట్టం కట్టారు తెలుగు ప్రజలు..

Bhimlanayak vs KGF 2: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ 2018లో విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై దాదాపు 140 కోట్లకు పైగా వసూలు చేసింది.. ఇప్పుడు ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఇది కూడా మరో ప్రభంజనానికి శ్రీకారం చుట్టనుంది.

ప్రాంతీయ అభిమానాన్ని పక్కన పెట్టి మరీ కన్నడ హీరోకి పట్టం కట్టారు తెలుగు ప్రజలు.. అందుకేనేమో కేజీఎప్ 2 బిజినెస్ దుమ్ములేపుతోంది. ప్రీ రిలీజ్ బిజెనెస్ కోట్లలో ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఓ పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. దీంతో బిజినెస్ ఊపందుకుంది.

ఈస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్ 7 కోట్లకు , ఉత్తరాంధ్ర రైట్స్ 10కోట్లకు బిజినెస్ చేసింది. దీంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ బిజినెస్ తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈస్ట్ గోదావరి భీమ్లా ప్రీ రిలీజ్ బిజినెస్ 6.4 కోట్లు చేసింది. మరోవైపు ఉత్తరాంధ్రలో రూ.9.2 కోట్ల వ్యాపారం జరిగింది. రెండు చిత్రాలకు పెద్ద వేరియేషన్ లేకపోయినా భీమ్లా బిజినెస్ కంటే కేజీఎఫ్ 2 బిజినెస్ ఎక్కువనే చెప్పాల్సి వస్తుంది.

శాండల్ వుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కేజీఎఫ్ 2 కోసం. ఈ చిత్రంలో రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి తదితరులు నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిలింస్ నిర్మించింది.

కేజీఎఫ్ కి స్వరాలు సమకూర్చిన రవి బస్రూర్ ఈ సీక్వెల్ కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు. కేజీఎఫ్ 2ని దేశంలోని 6 వేల స్క్రీన్‌లలో విడుదల చేయాలని చూస్తోంది చిత్ర యూనిట్. అదే రోజు విజయ్ నటించిన మృగం కూడా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని కూడా హోంబలే ఫిల్మ్స్ వారే నిర్మించడం విశేషం.

Tags

Next Story