Indian 2: 65 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం.. ఒకే షాట్‌లో 10 నిమిషాల డైలాగ్..

Indian 2: 65 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం.. ఒకే షాట్‌లో 10 నిమిషాల డైలాగ్..
Indian 2: చాలా కాలం తర్వాత విక్రమ్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కమల్ హాసన్. ఇప్పుడు మరింత ఉత్సాహంతో భారతీయుడు 2 చేయడానికి సిద్ధమవుతున్నారు.

Indian 2: చాలా కాలం తర్వాత విక్రమ్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కమల్ హాసన్. ఇప్పుడు మరింత ఉత్సాహంతో భారతీయుడు 2 చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం భారతీయుడుకి సీక్వెల్. తొలి భాగానికి దర్శకత్వం వహించిన దర్శకుడు శంకర్‌ ఇప్పుడు సీక్వెల్‌పై కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరో హిట్ కొట్టాలని పట్టుదలగా పని చేస్తున్నారు.

సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ప్రకారం, కథానాయకుడు కమల్ హాసన్ 14 భాషల్లో 10 నిమిషాల డైలాగ్‌ను ఒకే షాట్‌లో ఓకే చేశారట. భారతీయుడు 2లో ఇంతటి భారీ సన్నివేశాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడడానికి ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. కమల్ అద్భుత నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. 65 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో పని చేస్తున్నారు. నటన తన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం పోస్తారు.

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్‌తో కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సిద్ధార్థ్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Tags

Next Story