Indian 2 : ఇండియన్ 2 మూవీ ఆసక్తికరమైన అప్డేట్స్..

Indian 2 : కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన ప్రకటన చేసింది ఆ మూవీ టీం. వచ్చే నెల నుంచి ఇండియన్ 2 మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'హీ ఈజ్ బ్యాక్' అనే పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ నిర్మాణంలో ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌గైంట్ మూవీస్ కూడా భాగం కానుంది.
దర్శకుడు శంకర్, కమల్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా పెద్ద సెన్సేషన్‌తో పాటు కలెక్షన్లు కురిపించింది. దీనికి సీక్వెల్‌గానే ఇండియన్ 2 తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ 2019లోనే ప్రారంభమైనప్పటికీ అక్కడ జరిగిన చిన్న ప్రమాదం వల్ల వాయిదా పడింది. కరోనాతో మళ్లీ కొంత కాలం పోస్ట్‌పోన్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు దర్శకుడు శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Filming for #Indian2 from September. Wishing team @shankarshanmugh , #Subaskaran , @LycaProductions and everyone else involved a successful journey.
— Kamal Haasan (@ikamalhaasan) August 23, 2022
Welcome onboard thambi @Udhaystalin @RedGiantMovies_ https://t.co/iCbBZFX8X4 pic.twitter.com/uKInYMy15W
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com