Indian Idol 12: విన్నర్‌గా పవన్‌దీప్ రాజన్.. ఆరో స్థానంలో షణ్ముఖ ప్రియ

దేశ వ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్‌ను ఎంతో అలరించే.. పాపులర్ షో ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచారు. అరుణిత కంజిలాల్ రన్నరప్‌గా, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరోస్థానంలో నిలిచింది. ఇండియన్ ఐడల్ విజేత పవన్‌దీప్ రాజన్‌కు టైటిల్ ట్రోఫీతో పాటు, 25లక్షల రూపాయల చెక్కును అందజేశారు. గ్రాండ్ ఫినాలేలో మొత్తం ఆరుగురు సభ్యులు పాల్గొన్నారు. జావేద్ అలీ, మనోజ్ ముంతాషిర్, మిల్కాసింగ్, సుఖ్విందర్ సింగ్ తదితరులు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఎన్నో ఆశలతో ఫైనల్ పోరుకు చేరిన షణ్ముఖప్రియకు నిరాశే ఎదురైంది.
దాదాపు 12 గంటల పాటు విరామం లేకుండా జరిగిన ఫైనల్ పోరులో ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఫైనల్ షో అర్ధరాత్రి వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులు తిలకించి ఉర్రూతలూగారు. మొదటినుంచి అద్భుత గానంతో అలరించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి ఫైనల్ బరిలో మన తెలుగుతేజం షణ్ముఖ ప్రియతో సహా పవన్‌దీప్ రాజన్, అరుణిత కంజిలాల్, నిహల్, సేలీ కంబ్లే, మహ్మద్ దనిష్ నిలిచారు. ఈ ఫైనల్‌లో విజేతగా ఎవరు నిలుస్తారని అందరూ ఊపిరిబిగబట్టుకొని చూశారు. చివరగా ఫైనల్ విజేతగా పవన్‌దీప్‌ను ప్రకటించారు.
టైటిల్ గెలిచానని నమ్మలేకపోతున్నానని.. ఇండియన్ ఐడల్ 12 విన్నర్ పవన్‌దీప్(Pawandeep Rajan) అన్నారు. కలలో ఉన్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. తనను సపోర్ట్ చేసి ఓట్లువేసి గెలిపించిన అభిమానులు, ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇండియన్ ఐడల్ పోటీలో తనతో కలిసి ప్రయాణించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పవన్‌దీప్ రాజన్‌ది ఉత్తరఖండ్‌లోని చంపావత్ జిల్లా. ఇండియన్ ఐడల్ 12లో మొదటి నుంచి బలమైన పోటీదారుడిగా ఉన్నారు. 2015 పవన్‌దీప్ వాయిస్ ఇండియా షోలో విజేతగా నిలిచాడు. ఇక 2020 నవంబర్ 28న ప్రారంభమైన ఈ షో 9 నెలల పాటు సంగీత ప్రియులను అలరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com