puneeth rajkumar : పునీత్, సౌందర్యతో పాటుగా సినీ ప్రముఖులు చనిపోయాక విడుదలైన సినిమాలు..!

పునీత్ రాజ్‌కుమార్, సౌందర్యతో పాటుగా పలు సినీ ప్రముఖులు చనిపోయాక విడుదలైన సినిమాల జాబితాను ఇక్కడ చూద్దాం..!
పునీత్ రాజ్‌కుమార్ : గతేడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు.. ఆయన జయంతి నేడు(మార్చి 17).. అయన చివరి చిత్రమైన జేమ్స్ మూవీని ఈ రోజు రిలీజ్ చేశారు మేకర్స్... ఈ సినిమాలో పునీత్ కి ఆయన అన్నయ్య శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు.
విష్ణువర్ధన్: కన్నడ సీనియర్ హీరో విష్ణువర్ధన్ హీరోగా నటించిన చివరి చిత్రం ఆప్తరక్షక... ఈ సినిమా ఆయన చనిపోయాక 40రోజులకి రిలీజైంది. ఫిబ్రవరి 9న విడుదలైన ఆప్తరక్షక సూపర్ డూపర్ హిట్ అయింది.
సౌందర్య: హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది సౌందర్య.. ఆమె మరణాంతరం ఆప్తమిత్ర, శివశంకర్ సినిమాలు విడుదలయ్యాయి.
రిషీ కపూర్ : క్యాన్సర్‌తో చనిపోయిన రిషీ కపూర్ చివరి చిత్రం 'శర్మజీ నమ్కీన్'.. ఈ సినిమాని మార్చి 31న ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: 2020లో ముంబైలోని ఓ అపార్ట్మెంట్‌లో అత్మహత్యకు పాల్పడ్డాడు సుశాంత్.. అతని చివరి చిత్రం దిల్ బెచారా జులై 24న విడుదలైంది. సుశాంత్‌పై ఎంత ప్రేమతో ఈ సినిమాని చాలా మంది చూశారు.
అక్కినేని నాగేశ్వరరావు: నాగేశ్వరరావు చివరి సినిమా 'మనం' అక్కినేని చనిపోయిన ఐదు నెలల తర్వాత ఈ చిత్రం విడుదలైంది. వేరేవాళ్ళతో డబ్బింగ్ చెప్పిద్దామని నాగార్జున చెబితే లేదు తానే డబ్బింగ్ చెబుతానని పట్టుదలతో చెప్పారట అక్కినేని.
ప్రత్యూష: అనుమానాస్పద స్థితిలో 2002లో ప్రత్యూష మరణించింది. ఇప్పటికీ ఈమె మరణం మిస్టరీనే. ఆమె చనిపోయిన తర్వాత ఆమె చివరి చిత్రం సౌండ్ పార్టీ విడుదలైంది.
శ్రీహరి: కెరీర్ లో పీక్స్ స్టేజీలో ఉన్నప్పుడు మరణించారు శ్రీహరి.. ఆయన చనిపోయాక చాలా చిత్రాలు వేరే వాళ్ళ డబ్బింగ్ తో రిలీజ్ అయ్యాయి.
ఆర్తి అగర్వాల్: 2015లో చనిపోయిన ఆర్తి అగర్వాల్ చివరి చిత్రం ఆమె ఎవరు రిలీజైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com