Shraddha Kapoor : ఇండియాలో ఒన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ తనే

Shraddha Kapoor :  ఇండియాలో ఒన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ తనే
X

ఒక స్టార్ హీరో సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిందంటే పెద్ద వింతేం కాదు. పైగా అలాంటి సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తాయి. కంటెంట్ తో పాటు బలమైన టెక్నికల్ టీమ్ కూడా ఉంటుంది. బట్ ఇవేం లేకుండా కేవలం ఒకే భాషలో హయ్యొస్ట్ కలెక్షన్స్ వసూలు చేయడం, అదీ సీక్వెల్ తో అంటే అంతకు మించిన స్టార్డమ్ ఏముందీ.. తనను మాత్రమే ఇండియాస్ ఓన్లీ సూపర్ స్టార్ అంటే తప్పేముందీ..? యస్.. ఇప్పుడు శ్రద్ధా దాస్ ను ఇలా అనొచ్చు. ఇండియాస్ ఓన్లీ సూపర్ స్టార్. అఫ్ కోర్స్ ఇది లేడీ సూపర్ స్టార్ కేటగిరీలోనే అనుకోండి.. లేదంటే మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో మిగతా వారికి కోపం వస్తుంది.

అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన స్త్రీ 2.. రిలీజ్ కు ముందు నుంచే సంచలనాలు సృష్టించింది. ప్రీమియర్స్ తోనే 9 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఫస్ట్ డే ఏకంగా 65 కోట్లు సాధించి బాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత నంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి. 100, 200, 300, 500 కోట్లు.. ఇలా పెరుగుతూనే పోయింది. అది ఎంత వరకూ అంటే బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ బిగ్ కలెక్షన్స్( హిందీలో) సాధించిన జవాన్ మూవీని కూడా క్రాస్ చేసింది. జవాన్ ఫుల్ రన్ లో 584 కోట్లు వసూలు చేయగా స్త్రీ 2 ఇప్పటి వరకూ 586 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ ఫిగర్ 600 కోట్లకు ఖచ్చితంగా చేరుతుందని అంచనా వేస్తున్నారు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ లు. ప్రస్తుతం అక్కడ బలమైన సినిమాలేం లేవు. అందుకే ఈజీగా 600 కోట్లు సాధిస్తుందంటున్నారు.

హీరోలు ఫీలైనా ఒక నిజం ఏంటంటే.. శ్రద్ధా దాస్ ముందు ఇప్పుడున్న ఇండియన్ హీరోలంతా వెనకబడిపోయారనే చెప్పాలి. ఆమెకు మించి వసూళ్లు సాధించిన వారంతా భారీ బడ్జెట్ తోనే రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుల మాటునే కొల్లగొట్టారు తప్ప సోలోగా సత్తా చాటినవాళ్లెవరూ లేరు. అంతెందుకు.. మన సలార్, కల్కి కూడా స్త్రీ 2 కంటే వెనకే ఉన్నాయి. సో.. ఇండియాస్ ఓన్లీ సూపర్ స్టార్ ఫర్ నౌ అని శ్రద్ధా దాస్ ను పొగిడితే అస్సలు తప్పు లేదు.

Tags

Next Story