Chhello Show: ఆస్కార్ బరిలో 'ఛెల్లో షో'.. సినిమాలో నటించిన బాలనటుడు మృతి

Chhello Show: ఆస్కార్ బరిలో ఛెల్లో షో.. సినిమాలో నటించిన బాలనటుడు మృతి
X
Chhello Show: రెండ్రోజుల్లో సినిమా విడుదలవుతుందనగా అందులో నటించిన బాల నటుడు రాహుల్ కోలీ క్యాన్సర్‌తో మరణించాడు.

Chhello Show: రెండ్రోజుల్లో సినిమా విడుదలవుతుందనగా అందులో నటించిన బాల నటుడు రాహుల్ కోలీ క్యాన్సర్‌తో మరణించాడు. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. ఇంగ్లీషులో లాస్ట్ ఫిల్మ్ షో పేరుతో ఛెలో షోలో నటించిన ఆరుగురు బాల నటుల్లో రాహుల్ ఒకడు. గత కొంత కాలంగా అతడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.

బాల నటుడు రాహుల్ కోలీ 10 సంవత్సరాల వయస్సులో క్యాన్సర్‌తో మరణించడం చిత్ర సీమను కలచివేసింది. 95వ ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్ర విభాగంలో ప్రవేశం పొందిన ఛెల్లో షోలో రాహుల్ భాగమయ్యాడు. దివంగత బాల నటుడు మరణించడానికి కొన్ని రోజుల ముందు తీవ్ర జ్వరం, రక్తపు వాంతులు చేసుకున్నాడని రాహుల్ తండ్రి చెప్పారు. రాహుల్ అంత్యక్రియలు చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఛెల్లో షో చూస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదల కానుంది.

"అక్టోబరు 2, ఆదివారం, అల్పాహారం తీసుకున్న కొద్ది సేపటికే రాహుల్ కన్నుమూశాడని తండ్రి విలపిస్తూ చెప్పాడు. నా బిడ్డ ఇక లేడు. మా కుటుంబం నాశనమైంది అని అతని తండ్రి రాము కోలి ఆవేదన వ్యక్తి చేసాడు. గుజరాత్‌లోని మారుపల్లెలో జన్మించిన రాహుల్‌కి చిన్నతనం నుంచి సినిమాలంటే ఆసక్తి. వేసవి శెలవులు వచ్చాయంటే ప్రొజెక్షన్ బూత్ నుండి సినిమాలు చూస్తూ గడిపేవాడు.


ఛెల్లో షో చిత్రం న్యూయార్క్ సెట్ ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఇది హాలీవుడ్ అనుభవజ్ఞుడైన రాబర్ట్ డి నీరోని దాని వ్యవస్థాపకులలో ఒకరిగా పరిగణించింది. ఇది అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల అవుతుంది. అధికారికంగా విడుదల చేయడానికి ఒక రోజు ముందు, లాస్ట్ ఫిల్మ్ షో భారతదేశం అంతటా 95 థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

Tags

Next Story