Bollywood: యానిమల్ రిలీజ్ వాయిదా..

సినిమా అభిమానుల్ని 2023 రెండవ అర్ధభాగం అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది అర్ధభాగంలో పెద్ద హీరోల సినిమాలు థియేటర్లను తాకింది కొన్నే. అందులోనూ ఎక్కువగా బాక్స్‌ఆఫీస్ వద్ద ఢీలా పడ్డాయి. అయితే బాలీవుడ్ నుంచి ఈ నెల నుంచి వచ్చే నెలల్లో పలువురు అగ్రతారలు, అగ్రదర్శకులు తీస్తున్న సినిమాలు రిలీజ్‌కు వరుసలో ఉన్నాయి.
అందులో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన "రాఖీ ఔర్ రాణి ప్రేమ్ కథ", బాలీవుడ్ అగ్రనటుడు రణ్‌బీర్ కపూర్ నటించిన "యానిమల్", సన్నీ డియోల్ నటించిన గదర్, షారుఖ్ ఖాన్ నటుడిగా జవాన్ వంటి సినిమాలు విభిన్న రుచులు కలిగిన అభిమానుల్ని ఆహూతుల్ని చేయడానికి సిద్ధమవుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అవుతూ అభిమానుల్లో హీట్‌ను పెంచుతున్నాయి.
ముఖ్యంగా ఆగస్ట్ 11న ఒకే రోజు, స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన OMG2 సినిమా, సీనియర్ నటుడు నటించిన అప్పటి హిట్ చిత్రం గదర్‌కి సీక్వెల్‌గా రానున్న 'గదర్2' రెండూ బాక్స్ ఆఫీస్ వద్ద ఢీకొననున్నాయి. ఇదే రోజు రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' సినిమా కూడా రిలీజ్ కావల్సింది. అయితే సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను డిసెంబర్ 1కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. సినిమాకు బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికే సమయం పడుతోందని అన్నాడు.
ఈ విషయమై సందీప్ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశాడు. సినిమాను మంచి క్వాలిటీతో ప్రేక్షకులకు అందించాలనే మా ప్రయత్నంలో భాగంగానే సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. 5 భాషల్లో విడుదల చేస్తున్న కారణంగా విభిన్న భాషల్లోని సింగర్స్, పాటలు విభిన్నంగా రూపొందించడానికి ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఈ విషయం నాకు ఆలస్యంగా అర్థమైందన్నాడు. లేకుండే ప్రీ-టీజర్ రిలీజ్ చేసే వాడిని కాదన్నాడు. టీజర్‌ని ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ణతలు అని వెల్లడించాడు. టీజర్‌లోని కొన్ని చిత్రాలు సినిమాలో ఉండవు అని కొందరు అంటున్నారు. కానీ సినిమాకి అవే కీలకమైన సీన్లు అని వివరించాడు.
హిందీలో తీసిన పాటల నాణ్యత ఇతర భాషల్లో కూడా రావాలనుకుంటున్నాని అన్నాడు. ఇతర భాషల ప్రేక్షకులకు ఈ సినిమా హిందీ డబ్బింగ్‌గా అనిపించకూడదనే తపిస్తున్నానన్నాడు. ప్రతీ భాష ప్రేక్షకులు ఇది తమ భాషలోనే తీశారనే అనుభూతి పొందాలనేదే నా ప్రయత్నం అని వివరించాడు.
అయితే అదే రోజు భారత యుద్ధవీరుడు, మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న శామ్ బహదూర్ చిత్రంతో ఢీకొనననుంది. ఇందులో సాన్యా మల్హోత్ర, ఫాతిమా సనా షేక్‌లు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తీయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు హీరో విక్కీ కౌషల్ అన్నాడు.
2013, 2017లో రిలీజై హిట్ సాధించిన ఫర్కీ, ఫర్కీ రిటర్న్స్, అదే సీక్వెల్‌లో ఫర్కీ3 కూడా డిసెంబర్ 1నే రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com