Sita Ramam : నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమాలకు అన్యాయం

ఈ సారి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో తెలుగు సినిమాకు అన్యాయం జరిగిందా అంటే అవుననే చెప్పాలి. ముఖ్యంగా ఉత్తమ చిత్ం కేటగిరీలో ఈ వివక్ష కనిపిస్తోందంటున్నారు చాలామంది. ఈ కేటగిరీలో తెలుగు నుంచి నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో ఇప్పుడు అవార్డ్ గెలుచుకున్న కార్తికేయ 2 తో పాటు సీతారామం, మేజర్, బలగం సినిమాలున్నాయి. వీటిలో ఏదీ తక్కువ కాదు. కానీ దేశ భక్తి ప్రధానంగా సాగిన సీతారామం, మేజర్ చిత్రాలను అస్సలు పట్టించుకోకపోవడం బాధాకరం అనే చెప్పాలి.
సీతారామం గొప్ప ప్రేమకథా చిత్రం మాత్రమే కాదు.. ఆ రోజుల్లో పాకిస్తాన్ తో మన దేశ సంబంధాలను గురించి అద్భుతంగా వివరించారు. యుద్ధం, ప్రేమ కలబోతగా సాగిన త్యాగ భరిత ఎమోషనల్ మూవీగా సీతారామం ప్రేక్షకులను హృదయాలను గొప్పగా గెలుచుకుంది. ఇలాంటి మూవీకి ఏదో ఒక కేటగిరీలో అవార్డ్ వస్తుందని భావించారు. బట్ ఏ కేటగిరీలోనూ ఏ అవార్డ్ కూ నోచుకోలేదు సీతారామం.
మేజర్ గురించి కొత్తగా చెప్పేదేముంది. అడవి శేష్ నటించిన ఈ మూవీ చూసి కన్నీళ్లు పెట్టని వాళ్లున్నారా.. తాజ్ హోటెల్ అటాక్ పై రూపొందించిన మేజర్ చిత్రం కూడా జాతీయ అవార్డు సాధించకపోవడం ఆశ్చర్యం.
ఇక ప్రాంతీయ చిత్ర కేటగిరీలో అవార్డ్ అంటే బలగం ఖచ్చితంగా అర్హతలున్న సినిమా. తెలంగాణ సాంస్కృతిక మూలాలతో ఒక ప్రాంతపు మానవ సంబంధాల అస్తిత్వాన్ని అద్భుతంగా చూపించిన సినిమా బలగం. దాదాపు మూడు దశాబ్దాల క్రితం కనుమరుగైపోయిన గ్రామీణ ప్రాంతాల్లో ‘తెర బొమ్మల’సంస్కృతిని ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో మళ్లీ మనముందుకు తెచ్చింది. ఇది చాలు ఈ సినిమా దమ్మేంటో చెప్పడానికి. అయినా బలగం జాతీయ అవార్డుకు నోచుకోలేదు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న బలగంకు మన దగ్గర ఆదరణ లేకపోవడం ఖచ్చితంగా వివక్షే అంటున్నారు.
కార్తికేయ2 కు అవార్డ్ రావడం ఆనందమే. కానీ అంతకు మించిన అర్హతలున్న ఈ మూడు సినిమాలకు ఏ కేటగిరీలోనూ ఏ పురస్కారం దక్కకపోవడం చూసి ఖచ్చితంగా ఇది తెలుగువారికి జరిగిన అన్యాయం అనే అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com