Mogilayya : మొగిలయ్యకు బలగం సినిమాతో జరిగిన అన్యాయం తెలుసా..?

Mogilayya  :  మొగిలయ్యకు బలగం సినిమాతో జరిగిన అన్యాయం తెలుసా..?
X

ప్రభుత్వాలు హామీలు ఇస్తాయి. అమలు అప్పటికప్పుడే జరగదు. తెలంగాణలో అరుదైన కళాకారుడుగా గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య అనే జానపదకుడు మొగిలయ్య విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ఆయనకు ఇల్లు కట్టించి ఇస్తాం అన్నారు. జరగలేదు. సరే ప్రభుత్వం విషయం పక్కన పెడితే బలగం మూవీకి సంబంధించి కూడా రెండు రకాలుగా ఆయన్ని మోసగించారు మూవీ టీమ్. దిల్ రాజు ఆర్థిక సాయం చేశాడు. మెగాస్టార్ కూడా ఆర్థిక సాయం చేశాడు. అతను నిమ్స్ లో ఉన్నప్పుడు చాలామంది ఆదుకునే ప్రయత్నం చేశారు. వీటిని పక్కనపెడితే సినిమాకు సంబంధించి క్రెడిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. ఎవరైనా ఎవరికైనా క్రెడిట్ ఇవ్వకపోతే ఆవేదన చెందుతారు. కాస్త బలవంతులైతే పోరాటం చేస్తారు. ఈ రెండూ చేయలేక పోయాడు మొగిలయ్య. ఇంతకీ ఆయనకు దక్కని క్రెడిట్స్ ఏంటో తెలుసా..?

బలగం సినిమా అంతా ఒకెత్తైతే..చివర్లో మొగిలయ్య ఆయన భార్య పాడిన బాలి బాలి అనే పాట ఓ ఎత్తు. క్లైమాక్స్ లోని గాఢతను తమ గానంతో ప్రాణం పోశారు. పాటల మధ్యలో మాటలతో ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించారు. అంత గొప్ప కళ వీరిది. అయితే ఈ పాట సాహిత్యం, ట్యూన్ కూడా మొగిలయ్యదే. ఆ మాటకొస్తే తెలంగాణలోని ఈ తరహా సంచార జాతులంతా వినియోగించే గీతం ఇది. కానీ ఆ సాహిత్యాన్ని కొట్టేసి తనదే అన్నాడు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్. అలాగే ఆ ట్యూన్ ను తనే క్రియేట్ చేసినట్టుగా ఫీలయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో.

నిజానికి ఈ పాట సాహిత్యం మొగిలయ్యకు లేదా ఆ సంచార జాతుల క్రెడిట్. ట్యూన్ కూడా అంతే. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మొగిలయ్య తరహా కళాకారులు చాలామందే ఉన్నారు. ఇదే పాట, ట్యూన్ ను చనిపోయిన వారి పేర్లను రీ ప్లేస్ చేసి పాడుతుంటారు. ఏ ఊరు వెళ్లినా.. అదే పాట, అదే సాహిత్యం.. అక్కడి వ్యక్తుల పేర్లు మాతాయంతే. ఇది తెలిసి కూడా కాసర్ల శ్యామ్ ఈ పాట తనే రాశా అని ఘనంగా చెప్పుకున్నాడు.

విశేషం ఏంటంటే.. ఈ పాట తను రాసిందే అని మొగిలయ్య బలగం హవా సాగుతున్నప్పుడు ఓ డిజిటల్ చానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ దాన్ని బయటకు రాకుండా ఆపేశాడు కాసర్ల శ్యామ్ అంటారు. మొత్తంగా మొగిలయ్య ప్రతిభను వాడుకున్నారు కానీ.. ఆయన ప్రతిభకు క్రెడిట్స్ ఇవ్వకుండా మోసం చేశారు అనే చెప్పాలి. కనీసం బలగం దర్శకుడు వేణు అయినా ఈ తప్పును సవరించాల్సింది.

Tags

Next Story