రిలేషన్ షిప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కృతి సనన్

పదేళ్ల కిందట వచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ‘వన్.. నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ భామ కృతి సనన్. ఆ సినిమా నిరాశపరచడంతో బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టిన కృతి.. పలు హిట్ సినిమాల్లో నటించింది. ‘మిమి’మూవీలో యాక్టింగ్ గానూ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును అందుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి సనన్.. రిలేషన్ షిప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రిలేషన్ లో ఉన్న వ్యక్తుల మధ్య చిన్న చిన్న ఇగో ఇష్యూస్ రావడం కామన్ అని చెప్పుకొచ్చింది. ‘రిలేషన్‌షిప్ అన్నాక చిన్న చిన్న గొడవలు జరగడం సాధారణమే. అయితే గొడవ జరిగినప్పుడు నా తప్పు ఉంటే తప్పకుండా నేనే ముందు సారీ చెబుతా. లేకపోతే సారీ చెప్పను. కానీ ఏదో ఒకరకంగా దానిని పరిష్కరించాలనుకుంటా. అంతేకానీ, ఆ సమస్యను అలాగే వదిలేయడం నాకు ఇష్టం లేదు’ అని కృతిసనన్ క్లారిటీ ఇచ్చింది. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకున్నారా? అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నాకు అసలు కన్నీళ్లు రావని.. ఏడవనని చెప్పను. అలా అని ప్రతీ విషయానికి ఏడవను. బాధను తట్టుకోలేక కొన్నిసార్లు ఏడ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరితోనైనా గొడవ పడితే.. నాకు వెంటనే కన్నీళ్లు వచ్చేస్తాయి’ అని ఆమె చెప్పారు. తనకు సినిమాల్లోనే కొనసాగాలని ఉందని అన్నారు. సినిమా అంటే తనకెంతో ఇష్టమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com