ఒకే జోనర్‌లో రెండు సినిమాలు.. కామెడీలో హిట్ కమర్షియల్‌గా ఫట్..

ఒకే జోనర్‌లో రెండు సినిమాలు.. కామెడీలో హిట్ కమర్షియల్‌గా ఫట్..
మాస్‌ ఇమేజ్ ఉండి బ్రేక్ డ్యాన్సులతో షేక్ చేస్తున్న చిరంజీవి జంధ్యాల డైరక్షన్‌లో సినిమా అనేసరికి ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే అనేశారు.

మాస్‌ ఇమేజ్ ఉండి బ్రేక్ డ్యాన్సులతో షేక్ చేస్తున్న చిరంజీవి జంధ్యాల డైరక్షన్‌లో సినిమా అనేసరికి ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే అనేశారు. ఆయన కామెడీ సినిమాలకి చిరు ఫిదా అయ్యేవారు. ఆ ఇష్టంతోనే ఆయన స్టోరీ లైన్ చెప్పేసరికి కాదనలేకపోయారు.

దాంతో వీరిరువురి కాంబినేషన్‌లో 'చంటబ్బాయ్' తెరకెక్కింది. సుహాసిని హీరోయిన్‌గా నటించింది.. ఆధ్యంతం నవ్వులు పూయించినా నిర్మాతకు డబ్బులు కురిపించలేకపోయాడు చంటబ్బాయ్. 1986లో విడుదలైన ఈ సినిమా కథకి మూలం పీటర్ సెల్లర్ రాసిన 'ఏ షార్ట్ ఇన్ ది డార్క్' అనే నవల. చిరంజీవి డిటెక్టివ్ పాత్రలో కడుపుబ్బా నవ్వించినా సినిమా బావుందన్న టాక్ తప్ప కమర్షియల్‌గా హిట్ కొట్టలేకపోయింది.



ఇక మంచు మోహన్ బాబు కూడా డిటెక్టివ్‌గా కనిపించి ఫెయిల్ అయ్యారు. 1992లో వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డిటెక్టివ్ నారద' సినిమా ప్రియులకు చక్కిలిగింతలు పెట్టించి కడుపుబ్బా నవ్వించింది.. కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సంగీత పరంగా కూడా సక్సెస్ సాధించలేకపోయినా ఒకే ఒక్క పాట పాత్ర ఇప్పటికీ వినిపిస్తుంది. అదే ప్రేమ యాత్రలకు బృందావనమూ..



ఇద్దరు స్టార్ డైరెక్టర్లు, ఇద్దరు స్టార్‌ హీరోలల కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు డిటెక్టివ్ కథలు ప్లాపవడానికి కారణం వాటిని కామెడీ జోనర్‌లో రూపొందించడమే అని అప్పట్లో పెద్ద టాక్. సీరియస్‌గా సాగే కథలో హీరో చేత కామెడీ చేయించడం ఏంటని చాలా మంది చెవులు కొరుక్కున్నారు. మరి అలాంటి తరహా చిత్రాల్లో అటు చిరంజీవి గానీ, ఇటు మోహన్ బాబు గానీ నటించలేదు. ఇక దర్శకులు జంధ్యాల, వంశీ కూడా అదే జోనర్‌లో మళ్లీ సినిమాలు తీయలేదు.

Tags

Read MoreRead Less
Next Story