Pushpa Movie : పుష్ప ఎందుకు చూడాలి.. సినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి?

Pushpa Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాగా వచ్చింది పుష్ప మూవీ.. ఈ సినిమా ఈ రోజు(డిసెంబర్ 17న) భారీ అంచనాల నడుమ రిలీజైంది. అసలు ఈ సినిమాకి ఉన్న ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ ఏంటి.. ఇప్పుడు తెలుసుకుందాం..!
♦ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ఆర్య.. ఈ సినిమా 2004లో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయిదేళ్ళ తరవాత మళ్ళీ ఆ సినిమాకి సీక్వెల్ గా ఆర్య 2తో ఈ కాంబినేషన్ ప్రేక్షకుల ముందు వచ్చి అలరించింది. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత పుష్ప అంటూ మళ్ళీ ఈ కాంబో రిపీట్ అయింది.
♦ ముందుగా ఈ సినిమాని ఒకే పార్ట్ గా తీయాలని అనుకున్నారు కానీ కథ పెద్దది కావడంతో టూ పార్ట్స్ చేశారు..
♦ సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వరుసగా చేస్తున్న ఎనిమిదో సినిమా 'పుష్ప'
♦ అల్లు అర్జున్, సుకుమార్ కి ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేశారు.
♦ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ బాగా కష్టపడ్డారు. బాడీ పెంచారు. మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదట.. ఉదయం బన్నీ 4.30 నిద్రలేచి.. అయిదు గంటలకి సెట్‌కెళ్లి.. 5 నుంచి 7 వరకూ మేకప్ కోసమే ఓపిగ్గా కూర్చొనేవారట. షూటింగ్ అయిపోయాక మేకప్ తీయడానికి మరో 20 నుంచి 40 నిమిషాలు పట్టేదట. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా చిత్తూరు యాస నేర్చుకున్నారు.
♦ 'పుష్ప' ఎక్కువ భాగం అడవుల్లోనే చిత్రీకరించారు. దీనికోసం మారేడుమిల్లి అడవులను ఎంచుకున్నారు. అక్కడికి యూనిట్ మొత్తాన్ని షిఫ్ట్ చేసేందుకు ఏకంగా 300 వాహనాలను ఉపయోగించారట.
♦ ఎర్రచందనం దుంగల కోసం చిన్న ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది ఆర్ట్ డిపార్ట్‌మెంట్. ఫోమ్, ఫైబర్ కలిపి కృత్రిమ దుంగల్ని తయారు చేశారట..
♦ 'పుష్ప' కోసం అడవుల్లో రోజూ 500 మందికి పైగా పనిచేవారట. సినిమాలో ఓ పాటను ఏకంగా 1000మందితో చిత్రీకరించారు.
♦ ఈ సినిమాకోసం మిరోస్లా కూబా బ్రోజెక్ పోలెండ్‌కు చెందిన సినిమాటోగ్రాఫర్ పనిచేశారు.
♦ ఈ సినిమా కోసం ఇద్దరు ఎడిటర్లు పనిచేశారు. కార్తీక్ శ్రీనివాససన్, రుబెన్
♦ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం బాగానే ఖర్చుపెట్టారట.. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం అయితే ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు పెట్టారట.
♦ ఈ సినిమాలో సమంత 'ఉ అంటావా... ఊఊ అంటావా' అనే ఐటెమ్ సాంగ్ చేసింది.. సమంతకి ఇది ఫస్ట్ ఐటెం సాంగ్ కాగా.. ఈ పాట కోసం సామ్ కోటిన్నర డిమాండ్ చేసింది. మొత్తం ఈ పాట కోసం అయిదు కోట్లు ఖర్చు చేశారు.
♦ మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో రష్మికకి ఇది రెండో సినిమా.. దీనికి ముందు డియర్ కామ్రేడ్ సినిమా చేసింది రష్మిక. అయితే పుష్ప తొలి పార్ట్‌లో రష్మిక పాత్ర కొద్దిగానే ఉంటుందని, రెండో పార్ట్ లో ఆమె నటన అద్భుతంగా ఉంటుందని టాక్.
♦ ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 180కోట్లు ఖర్చు చేశారట.
♦ ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, కన్నడ నటుడు ధనుంజయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఫహద్ ఫాజిల్ పాత్ర కోసం ముందుగా విజయ్ సేతుపతిని అడిగారు కానీ డేట్స్ కుదరలేదు.
♦ సునీల్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఓ స్టార్ హీరోలో సునీల్ విలన్ గా చేయడం ఇదే ఫస్ట్ టైం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com