ఒకే కథ.. ఏఎన్నార్ కు సూపర్ హిట్.. బాలయ్యకు బంపర్ హిట్ ..!

ఒకే కథ.. ఏఎన్నార్ కు సూపర్ హిట్.. బాలయ్యకు బంపర్ హిట్ ..!
సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలు అంటూ ఉండవు.. రావు కూడా.. ఉన్న కథలనే అటుఇటుగా మార్చి కొత్త తరహ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకొని హిట్ కొట్టేయడమే...

సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలు అంటూ ఉండవు.. రావు కూడా.. ఉన్న కథలనే అటుఇటుగా మార్చి కొత్త తరహ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకొని హిట్ కొట్టేయడమే... ఏ సినిమాని చూసుకున్న ఎదో తరహ సినిమా కథ అందులో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒకే తరహ కథతో వచ్చి సక్సెస్ అయిన రెండు హిట్ సినిమాల గురించి మాట్లాడుకుందాం.

అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ప్రేమాభిషేకం.. వీరి కలయికలో వచ్చిన ఆరో చిత్రం ఇది. ఈ సినిమాలో శ్రీదేవి, జయసుధ హీరోయిన్లుగా నటించారు. దేవదాసు సినిమాలోని పార్వతి, చంద్రముఖిలను ప్రేరణగా తీసుకొని దాసరి నారాయణ రావు తెరకెక్కించారు. 1981 ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఈ సినిమాలో హీరోకి క్యాన్సర్ అని తెలియడంతో ఆ విషయాన్ని దాచిపెట్టి హీరోయిన్ కి వేరే వివాహం జరిగేలా ప్రవర్తిస్తాడు. ఇందులోని ఏఎన్నార్ నటనకి ప్రేక్షకులు నీరాజనం పలికారు.

ప్రేమాభిషేకం సినిమా వచ్చిన 13 సంవత్సరాల తర్వాత ఇదే కథని కొద్దిగా మార్చి బొబ్బిలి సింహం పేరుతో తెరకెక్కించారు దర్శకుడు కోదండరామిరెడ్డి. ఈ సినిమాలో హీరోకి బదులుగా హీరోయిన్ కి క్యాన్సర్ పెట్టి దానిని దాచిపెట్టి హీరోకి మరో పెళ్లి చేస్తుంది హీరోయిన్.. దీనికి సృష్టికర్త రచయిత విజయేంద్రప్రసాద్. బాలకృష్ణ, మీనా, రోజా ప్రధానపాత్రలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అనిపించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story