Rajisha Vijayan : 'జై భీమ్' లో సూర్య పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Rajisha Vijayan : సక్సెస్ ఫెయిల్యూర్ లతో సంబంధం లేకుండా ప్రయోగాలకే పెద్ద పీట వేస్తూ సినిమాలు చేస్తుండడం హీరో సూర్య స్పెషాలిటీ. సూర్య కెరీర్లో అత్యధిక విజయాలు ప్రయోగాల ద్వారా వచ్చినవే. అలా తాజాగా సూర్య నుంచి వచ్చిన చిత్రమే.. 'జై భీమ్'.. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు (నవంబర్ 2)న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకునేలా సినిమాని తెరకెక్కించారు దర్శకుడు జ్ణానవేల్.
సూర్యతో పాటుగా ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రాజిష విజయన్, లిజోమోల్ జోసీ, మణికంఠన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో రాజిష విజయన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ఆమె విచారణాధికారిగా నటించి మెప్పించింది. దీనితో ఆమె ఎవరనే ఆసక్తి నెలకొంది అందరిలో.
రాజిష విజయన్ ఇప్పటివరకు మలయాళం మరియు తమిళ చిత్రాలలో సుమారుగా ఓ పదికి పైగా చిత్రాలలో నటించింది. త్వరలో రవితేజ హీరోగా రాబోతున్న రామరావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి కూడా పరిచయం కాబోతోంది. ఆమె కేరళలోని కాలికట్ లో 15 జూలై 1991వ సంవత్సరంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు విజయన్ .. ఆయన ఆర్మీలో పనిచేశారు.. ఆమె తల్లిపేరు షీలా.. రాజిషకి ఓ చెల్లి కూడా ఉంది.
నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డీగ్రీ పూర్తి చేశారు. సినిమాల్లోకి రాకముందు పలు టీవీ షోలకి యాంకర్‌గా పనిచేశారు రాజిష విజయన్. ముందుగా అనురాగ కరిక్కిన్ వెల్లం అనే మలయాళ చిత్రంలో నటించారు. 2016లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో ఆమె పాత్రకి గాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత తమిళ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా రాణిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com