సినిమా

Puneeth Rajkumar: పునీత్ చివరి సినిమాలో ఈయనే విలన్.. ‌'జేమ్స్' గురించి ఆసక్తికర విషయాలు..

Puneeth Rajkumar: మంచివారిని దేవుడు ముందే తీసుకెళ్లిపోతాడు అంటుంటారు. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది.

Puneeth Rajkumar (tv5news.in)
X

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar: మంచివారిని దేవుడు ముందే తీసుకెళ్లిపోతాడు అంటుంటారు. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఇటీవల జరిగిన పునీత్ రాజ్‌కుమార్ మరణం కూడా అలాంటిదే. అంత పెద్ద సూపర్ స్టార్ వారసుడు అయినా, తనకంటూ చాలా ఫ్యాన్ బేస్ ఉన్నా పునీత్ మాత్రం ఎప్పుడు అలా ఉండేవాడు కాదని తన స్నేహితులు అంటున్నారు. పునీత్ పార్థివదేహాన్ని చూడడానికి కంఠీరవకు చేరుకున్న శ్రీకాంత్ మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు.పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం 'జేమ్స్'. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వగానే పునీత్ అకాల మరణం చెందారు. అయితే ఈ సినిమా శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ.. తనకు పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు శ్రీకాంత్. జేమ్స్ సినిమాలో తనది విలన్ పాత్ర అని, పునీత్ తనకు బాడీగార్డ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారని చెప్పారు.

పునీత్ తనకోసం ఇంటి నుండి భోజనం తెచ్చేవాడని గుర్తుచేసుకున్నారు శ్రీకాంత్. సెట్స్‌లో పునీత్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవారని శ్రీకాంత్ అన్నారు. జేమ్స్ సినిమాకు సంబంధించి ఒక ఫైట్ సీన్, పాట, డబ్బి్ంగ్ పనులు ఇంకా మిగిలున్నాయని శ్రీకాంత్ తెలిపారు. అయితే కన్నడలో కూడా తనే డబ్బింగ్ చెప్తే బాగుంటుందని పునీత్ కోరారని శ్రీకాంత్ అన్నారు.

జిమ్‌లో వర్కవుట్‌లే పునీత్ రాజ్‌కుమార్ హార్ట్ ఎటాక్‌కు కారణమేమో అంటూ వస్తున్న వార్తలపై ఆయన స్నేహితులు స్పందించారు. పునీత్ ముందు రోజు రాత్రి నుండి ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా ఉంది అన్నారట. ఉదయం లేవగానే ఆయన ఫ్యామిలీ డాక్టర్‌ను కూడా కలవడానికి వెళ్లారట. ఆ తర్వత కాసేపటికే గుండెపోటుతో మరణించారు. ఇక ఈరోజు కంఠీరవలో పునీత్ అంత్యక్రియలు ముగిశాయి. తన తల్లి, తండ్రి అంత్యక్రియలు జరిగిన చోటే పునీత్ అంత్యక్రియలు కూడా నిర్వహించారు కుటుంబసభ్యులు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES