Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షాకు పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టిన బావమరిది..

Shah Rukh Khan (tv5news.in)
Shah Rukh Khan: సినీ రంగంలో అభిమానులను సంపాదించుకోవడం అంతా సులువైన విషయం ఏమీ కాదు. పైగా ఎన్ని ఫ్లాపులు ఎదురైనా.. ఆ ఫ్యాన్ బేస్‌ను నిలబెట్టుకోవడం చాలా కష్టం. అయినా ఫ్లాపులతో కూడా బాలీవుడ్‌లో బాద్‌షా లాగా వెలిగిపోతున్నాడు షారూఖ్ ఖాన్. బీ టౌన్‌లో ఈ బాద్‌షాకు కింగ్ ఆఫ్ రొమాన్స్ అని కూడా పేరుంది. ఆయన నటించిన ఒకప్పటి రొమాంటిక్ సినిమాలకు ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. షారూఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా తన గురించి ప్రేక్షకులకు తెలియని కొన్ని విశేషాలు..
షారూఖ్ ఖాన్‌కు హీరోగా ఒకటేసారి రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. 'దిల్ ఆష్నా హై', 'దివానా'. రెండు సినిమాలు ఒకటేసారి షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయి కూడా. కానీ 'దిల్ ఆష్నా హై' రిలీజ్ ఆలస్యం అవ్వడంతో దివానా షారూఖ్ డెబ్యూ సినిమాగా నిలిచింది. షారూఖ్ ఇప్పటివరకు దివానా సినిమానే చూడలేదట. ఎందుకని ఒక ఇంటర్వ్యూలో తనను ప్రశ్నించగా.. నేను నా ఆఖరి సినిమాను, మొదటి సినిమాను చూడాలి అనుకోవడ్లేదని చెప్పారట.
ప్రఖ్యాత మ్యాగజిన్ ఫోర్భ్స్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి ఎమ్మా స్టోన్. కానీ షారూఖ్ ఖాన్ తనకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్.
ఫారూఖ్ ఖాన్ ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా.. వేరేవాళ్ల సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేయడానికి, విలన్‌గా నటించడానికి ఏ మాత్రం వెనకాడరు. ఆలియా భట్ హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'డియర్ జిందగీ'లో షారూఖ్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమాలో ఆయన నటనకు బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు కూడా అందుకున్నాడు.
చాలా సర్వేల ప్రకారం షారూఖ్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నాడు. వరుసగా కొన్ని సంవత్సరాలు ఫ్లాపులు ఎదురైనా కూడా షారూఖ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తన సినిమాకు కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం లోటుపాట్లు ఉండవు.
షారూఖ్ ఖాన్.. డిజైనర్, ప్రొడ్యూసర్ గౌరీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వారి పెళ్లి మాత్రం ఒక సినిమా స్టైల్‌లో జరిగిందని షారూఖ్ ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాడు. గౌరీ ఖాన్ తమ్ముడు విక్రాంత్‌కు షారూఖ్ అస్సలు నచ్చలేదట. అందుకే అతడు పాయింట్ బ్లాంక్‌లో షారూఖ్‌కు గన్ పెట్టి తన అక్కను వదిలేయమని బెదిరించాడట. అయినా కూడా షారూఖ్ ఏ మాత్రం భయపడకుండా గౌరీ చేయి పట్టుకున్నాడు. ఆ తర్వాత అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
ఇప్పటివరకు షారూఖ్ కెరీర్‌లో ఒక్క నెగిటివ్ మార్క్ కూడా లేదు. స్క్రీన్‌పైన మంచి యాక్టర్‌గా, రియల్ లైఫ్‌లో ఫ్యామిలీ మ్యాన్‌గా షారూఖ్‌ను అందరు అభిమానిస్తారు. అలాంటి షారూఖ్ తన కొడుకు ఆర్యన్ వల్ల డ్రగ్స్ కేసు విషయంపై కోర్టు మెట్లు ఎక్కాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com