Kalisundam Raa : వెంకీ 'కలిసుందాంరా' సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్..!

Kalisundam Raa : వెంకీ కలిసుందాంరా సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్..!
Kalisundam Raa : ఫ్యామిలీ మూవీస్ అంటే ప్రేక్షకులకి టక్కున గుర్తొచ్చే హీరో విక్టరీ వెంకటేష్.. ఫ్యామిలీ ఎమోషన్స్‌‌ని వెంకీ అద్భుతంగా పండిస్తాడు.

Kalisundam Raa : ఫ్యామిలీ మూవీస్ అంటే ప్రేక్షకులకి టక్కున గుర్తొచ్చే హీరో విక్టరీ వెంకటేష్.. ఫ్యామిలీ ఎమోషన్స్‌‌ని వెంకీ అద్భుతంగా పండిస్తాడు.. అలాంటి వెంకటేష్ నుంచి వచ్చిన ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా 'కలిసుందాంరా'.. అది 1999 సంవత్సరం... ప్రేమించుకుందాం.. రా..! నుంచి రాజా వరకు వరుసగా అరు హిట్స్ కొట్టిన వెంకటేష్‌‌కి శీను మూవీ వరుస విజయాలకి బ్రేక్ వేసింది. ఈసారి చేయబోయే సినిమాతో మంచి హిట్ కొట్టాలని అనుకున్నాడు వెంకటేష్.. అయితే అప్పటికే తమిళ్‌‌లో పూచుడవ అనే ఓకే ఒక్క మూవీ చేసిన దర్శకుడు ఉదయశంకర్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకటేష్. ఆ కథే 'కలిసుందాంరా'

అయితే ఈ కథను ముందుగా కింగ్ నాగార్జునకి వినిపించారట ఉదయశంకర్.. అప్పటికే చంద్రలేఖ, సీతారామరాజు లాంటి ఫ్యామిలీ మూవీస్‌‌కి కమిట్ అయిన నాగార్జున మళ్ళీ ఫ్యామిలీ మూవీ ఎందుకని ఈ కథని రిజెక్ట్ చేశాడట. అంతేకాకుండా ఈ కథకి వెంకటేష్‌ని సజెస్ట్ చేసింది కూడా నాగార్జననేనట. ఇక కలిసుందాంరా సినిమాకి ముందుగా అంజల జవేరిని హీరోయిన్‌‌గా అనుకున్నారు.. ఓ ఫోటో షూట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆమెను వద్దనుకొని సిమ్రాన్‌‌ని తీసుకున్నారు. ఇక్కడో విశేషం ఏంటంటే ఉదయశంకర్ మొదటి సినిమా పూచుడవ సినిమాలో కూడా హీరోయిన్ సిమ్రాన్ కావడం.

నాలుగు కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కిన కలిసుందాంరా సినిమా 2000సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిల్లలతో సరదాలు, మరదలితో సరసాలు, ఇంట్లో వాళ్ళతో అనుబంధాలు, ఆప్యాయతలు, తాతమనవడి ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అనిపించుకున్న కలిసుందాంరా.. ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. చెప్పుకోడానికి ఇదేం పెద్ద కథే కాకపోయినప్పటికీ ఉదయశంకర్ ట్రీట్మెంట్ తో మ్యాజిక్ చేసింది. విడుదలైన 76 కేంద్రాలలో 100 రోజులు ఆడడం విశేషం. ఈ రేర్ రికార్డు అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ నటించిన లవకుశ సినిమా పేరిట ఉంది.

ఇక 17 కేంద్రాలలో 175 రోజులు, 3 కేంద్రాలలో 200 రోజులు ప్రదర్శింపబడి 25 కోట్ల స్టన్నింగ్ కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story