విజయశాంతి సినిమాకి బలైన యమున సినిమా.. ట్విస్ట్ ఏంటంటే డైరెక్టర్ కూడా ఒక్కరే..!

విజయశాంతి సినిమాకి బలైన యమున సినిమా.. ట్విస్ట్ ఏంటంటే డైరెక్టర్ కూడా ఒక్కరే..!
ఇండస్ట్రీలో ఒకేరోజున స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్.. కానీ ఒకేరోజున ఒకే హీరోకి సంబంధించిన సినిమాలు రిలీజ్ అవ్వడం వెరీ రేర్.

ఇండస్ట్రీలో ఒకేరోజున స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్.. కానీ ఒకేరోజున ఒకే హీరోకి సంబంధించిన రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం వెరీ రేర్.. ఇలాంటి సంఘటన బాలకృష్ణ విషయంలో ఓ సారి జరిగింది. కానీ ఒకే డైరెక్టర్‌‌కి సంబంధించిన రెండు సినిమలు ఒకే రోజున రిలీజ్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో ఓ అద్భుతమే అని చెప్పాలి. ఇలాంటి అద్భుతమైన సంఘటన 1990లో దర్శకుడు ఎ. మోహన గాంధీకి జరిగింది.

అర్ధాంగి చిత్రంతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు మోహనగాంధీ... మంచి మనసులు, వారసుడొచ్చాడు, మౌనపోరాటం చిత్రాలతో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. అయితే 1990వ సంవత్సరంలో ఆయన దర్శకత్వంలో విజయశాంతి ప్రధానపాత్రలో కర్తవ్యం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు.. లేడీ సూపర్ స్టార్ అనే పేరు ఈ సినిమాతోనే గుర్తింపు పొందారు విజయశాంతి.

అయితే ఈ సినిమా సక్సెస్ లో మరో సినిమా తుడిచి పెట్టుకుపోయింది. హీరోయిన్ యమున మెయిన్ లీడ్‌‌లో ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో ఆడది అనే సినిమా తెరకెక్కింది. నటుడు శివకృష్ణ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషించారు. అయితే విజయశాంతి కర్తవ్యం సినిమా రిలీజ్ రోజునే ఆడది సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు శివకృష్ణ.

రెండు సినిమాలకి పరుచూరి గోపాలకృష్ణ రచయితగా పనిచేశారు. దీంతో ఆయన ఆడది సినిమాని ఓ వారం రోజుల తర్వాత రిలీజ్ చేయాలని శివకృష్ణకి సూచించారు.. కానీ శివకృష్ణ ఒప్పుకోకపోవడంతో కర్తవ్యం సినిమా రిలీజ్ రోజే ఆడది చిత్రం కూడా రిలిజైంది. ఫలితంగా కర్తవ్యం సినిమా ఎక్కడికో వెళ్ళగా, ఆడది చిత్రం దెబ్బతింది. ఈ విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story