Pushpa Trailer : 'పుష్ప'లో శానా ఉంది.. సుకుమార్, బన్నీకి ఇదే ఫస్ట్ టైమ్..!

Pushpa Trailer : సుకుమర్ అంటేనే క్రియేటివ్.. ఒక్క సీన్ కే రెండేసి సీన్లు రాసుకుంటాడు.. అలాంటిది రెండు భాగాల సినిమాగా తీయగలిగిన స్కోప్ వున్న కథకు ఇంకెలా రాసుకుంటాడు.. దీనికి సమాధానం పుష్ప ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతోంది. రెండు నిమిషాల 31 సెకెండ్లు ఉన్న ట్రైలర్‌లో సుకుమార్ చాలానే చెప్పారు.. అలాగే చాలా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేశారు.
ట్రయిలర్‌ను చాలా ఇంట్రస్టింగ్‌గా కట్ చేయడంలో దర్శకుడు సుకుమార్ చాకచక్యం కనిపించింది.. ప్రతిపాత్ర, ప్రతి సీన్ కథని చెపుతుంది. మొత్తానికి సినిమాలో చాలానే సరుకుందన్న విషయాన్నీ ట్రైలర్ తో చెప్పేశారు సుకుమార్. అయితే చిత్ర ట్రైలర్‌లో చూస్తుంటే ఇందులో బన్నీ మూడు విభిన్నమైన పాత్రాలలో కనిపించనున్నాడని తెలుస్తోంది. అంటే త్రిబుల్ యాక్షన్ అన్నట్టు. ఇలా చేయడం సుకుమార్, బన్నీకి ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో ఓ పాత్ర, శ్రీవల్లితో లవ్ స్టోరీతో మరో పాత్ర. రాజకీయాల సంపాదనతో ఇంకో పాత్ర ఉండనుందని తెలుస్తోంది. మూడు పాత్రలతో రెండు భాగాలుగా సినిమాను సుకుమార్ ఫ్లాన్ చేసాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇందలో రాజకీయాల సంపాదనతో వచ్చే పుష్ప రాజ్ పాత్ర సినిమాకే మెయిన్ హైలెట్ కానుందని టాక్.
ఒకవేళ ఇదే నిజమైతే బన్నీ ఫ్యాన్స్‌కు పుష్ప మూవీ బిగ్ ట్రీట్ అన్నట్టే.. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తం నాలుగు భాషల్లో ఈ సినిమాని రిలిక్ చేయనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com