Godari Gattupaina Movie : గోదారి గట్టుపైన ఇంట్రెస్టింగ్ టీజర్

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆరంభం నుంచే అవి ఆకట్టుకోవడం గ్యారెంటీ అనిపించేలా ఉంటున్నాయి. అలాంటిదే గోదారి గట్టుపైన అనే మూవీ కూడా. ఈ మూవీ టైటిల్ తోనే మెప్పించారు. తాజాగా టీజర్ కూడా విడుదల చేశారు. టీజర్ కూడా ఆకట్టుకునేలా కట్ చేశారు. అలాంటిది ఇదేమంత కొత్త కంటెంట్ అంటే అది కూడా లేదు. ఓ కుర్రాళ్ల బ్యాచ్.. అందులో ఆటో డ్రైవర్స్ ఉన్నారు.. ఒకడు మంగలి కుర్రాడు ఉన్నాడు.. వీళ్లందరికీ గ్రూప్ లీడర్ లా హీరో ఉన్నాడు. అతనికి అమ్మాయితో లవ్ లో ఉంటుంది. మరి ఆ లవ్ ఏమవుతుంది.. ? వారి ప్రేమ ఎక్కడి వరకు వెళుతుంది..? గెలుస్తుందా లేదా అనేది సింపుల్ గా ఊహించేలానే ఉంది. అదంతా రెగ్యులర్ కంటెంట్ లానే కనిపిస్తూనే ఏదో కొత్తగా ఉందే అనిపించేలా ఫ్రెష్ గా అనిపిస్తోంది టీజర్ చూస్తుంటే.
స్టార్ కాస్ట్ అంటూ పెద్దగా కనిపించడం లేదు. బట్ అంతా తెలిసిన కమెడియన్స్ ఉన్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా నిధి ప్రదీప్ హీరోయిన్ గా కనిపిస్తోంది. జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల వంటి స్టార్ కాస్టింగ్ కూడా కనిపిస్తోంది. నాగవంశీ సంగీతం అందించాడు.అభినవ్ రావు నిర్మాతగా వ్యవహరించారు. సుభాష్ చంద్ర డైరెక్ట్ చేసిన మూవీ ఇది. సింపుల్ గా అయితే బాగా ఆకట్టుకునే అవకాశాలున్న సినిమాలా కనిపిస్తోంది. మరి అలా ఉంటుందా లేదా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

