War 2 Release date : వార్ 2 పై అనుమానాలే వద్దట

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తోన్న సినిమా 'వార్ 2'. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై నార్త్ తో పాటు సౌత్ లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు. అతని కెరీర్ లో ఓ కీలకమైన సినిమా అవుతుందంటున్నారు. ముఖ్యంగా అతని పాత్ర గురించిన కథనాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ 'వీరేంద్ర రఘునాథ్' అనే రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. సౌత్ ఇండియాకు చెందిన వీరేంద్ర తన సహచరుల చేతిలో మోసపోయి తర్వాత నెగెటివ్ మైండ్ సెట్ తో ఉంటాడు. అలాంటి వ్యక్తితో ఇండియన్ రా ఏజెంట్ కబీర్ తలపడాల్సి ఉంటుందట. అంటే ఓ రకంగా ఇందులో ఎన్టీఆర్ చేస్తున్నది విలన్ పాత్రే అని ఫిక్స్ అయిపోవచ్చు. మరి చివర్లో ఏదైనా ట్విస్ట్ ఉంటుందేమో కానీ.. ఇప్పటికైతే ఇదే ఫైనల్ అనుకోవచ్చు.
ఇక ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అయితే రీసెంట్ గా ఈ మూవీ ఆగస్ట్ నుంచి పోస్ట్ పోన్ అవుతందనే న్యూస్ వస్తున్నాయి. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందని.. అందుకే ఆగస్ట్ 15న రావడం సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.అయితే ఈ వార్తల్లో నిజం లేదు అంటున్నాడు చిత్ర రచయిత అబ్బాస్ టైర్ వాలా అంటున్నాడు. అతను చెప్పినదాన్ని బట్టి ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిందట. అందుకే పోస్ట్ పోన్ అనే వార్తల్లో నిజం లేదట. చెప్పిన టైమ్ కే రిలీజ్ అవుతుందన్నాడు. సో.. ఈ న్యూస్ అన్నీ బేస్ లెస్ అనుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com