నందు బ్యాగ్రౌండ్ మాములుగా లేదు..బాలయ్యకు ఏమవుతాడో తెలుసా..!

నందు బ్యాగ్రౌండ్ మాములుగా లేదు..బాలయ్యకు ఏమవుతాడో తెలుసా..!

Harikrishna

Intinti Gruhalakshmi Serial: ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న మరో సీరియల్ 'ఇంటింటి గృహలక్ష్మి'.

Intinti Gruhalakshmi Serial: ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న మరో సీరియల్ 'ఇంటింటి గృహలక్ష్మి'. కార్తీకదీపం సీరియల్ తర్వాత అత్యధిక రేటింగ్ ఉన్న సీరియల్ 'ఇంటింటి గృహలక్ష్మి'. ఈ సీరియల్ మొత్తం లీడ్ తులసి, నందగోపాల్, లాస్య పాత్రల చూట్టూనే తిరుగుతుంది. తులసి పాత్రలో సీనియర్ హీరోయిన్ కస్తూరి నటిస్తుంది. లాస్య పాత్ర యాంకర్, హీరోయిన్ ప్రశాంతి నటిస్తుంది. నందు పాత్రలో చేసే నటుడి పేరు హరికృష్ణ. అయితే లీడ్ రోల్ తులసి (కస్తూరి) తెలుగు నటి కాదు. అలాగే ఆమెకు భర్తగా నటిస్తున్న నందు (హరికృష్ణ) తన పాత్రకు తగ్గ న్యాయం చేస్తున్నాడు.

హరికృష్ణ పరభాష నటుడిగా అందరూ భావించారు. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. హరికృష్ణ మన తెలుగు వాడే. హరికృష్ణకి మంచి బ్యాగ్రౌండ్ ఉంది. టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య.. మనువడే ఈ హరికృష్ణ. ఆయన ప్రేరణతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు చెప్తున్నా హరికృష్ణ.. తాత (బాలయ్య) బ్యాగ్రౌండ్‌ని ఉపయోగించుకోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. స్వయంకృషితోనే ఇండస్ట్రీలోకి వచ్చానని.. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు.

హరికృష్ణ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నా.. క్యారెక్టర్స్ కోసం కష్టపడ్డాను. కష్టంతోనే మనం పైకి రావాలనేది నా అభిప్రాయం. స్విమ్మింగ్ రాకుండా దిగితే ఎంత ప్రమాదమో యాక్టింగ్ రాకుండా ఈ ఫీల్డ్‌లోకి వస్తే ఏమీ చేయలేం. అందుకే యాక్టింగ్ నేర్చుకోవడానికి కాస్త టైం పట్టింది. ఇష్టంగానే కష్టపడ్డా అని హరికృష్ణ చెప్పుకొచ్చారు. హరికృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి. చదువు మొత్తం చెన్నైలో సాగింది. హరికృష్ణ 2008 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మొదటిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన 'హ్యాపీ డేస్' అనే సీరియల్‌లో కనిపించాడు. పలు సీరియల్స్ లోనూ హరికృష్ణ కనిపించాడు.

Tags

Next Story