పోకిరి సినిమాకి మహేష్ కంటే ముందు పూరి అనుకున్న హీరో ఎవరో తెలుసా?

పోకిరి సినిమాకి మహేష్ కంటే ముందు పూరి అనుకున్న హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు పోకిరి, బిజినెస్ మెన్ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇందులో పోకిరి చిత్రం అయితే తెలుగు సినిమాలో అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా విడుదలై నేటికి 15 సంవత్సరాలు.. ఈ సందర్భంగా సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

* బద్రి సినిమా కంటే ముందే పూరి ఈ కథను రాసుకున్నారు.

* ఈ సినిమాని రవితేజతో చేయలని అనుకున్నారు పూరి..

* 'ఉత్తమ్‌ సింగ్‌.. సన్నాఫ్‌ సూర్య నారాయణ' అనే టైటిల్‌తో ఈ కథను రాసుకున్నారు పూరి... కానీ మహేష్ బాబుతో చేయాల్సి వచ్చినప్పుడు టైటిల్ ని పోకిరిగా మార్చారు.

* ముందుగా హీరోయిన్ గా అయేషా టకియాని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఆ పాత్రను వదులుకుంది.

* ఆ తరవాత కంగనా రనౌత్‌ ఆ పాత్రను దక్కించుకుంది. అయితే ఈ సినిమాకి ఆడిషన్ ఇచ్చిన టైంలోనే బాలీవుడ్ చిత్రమైన గ్యాంగ్‌స్టర్‌ చిత్రానికి కూడా ఆడిషన్ ఇచ్చారు కంగానా.. అయితే రెండిట్లో సెలెక్ట్ కావడంతో పోకిరిని వదులుకున్నారు కంగనా

* అప్పుడే దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానాకి ఆ ఛాన్స్ వచ్చింది.

* అంతకుముందు సినిమాలో ఒకే హెయిర్ స్టైల్ తో కనిపించిన మహేష్.. ఈ సినిమా కోసం జుట్టు పెంచి హెయిర్ స్టైల్ మార్చారు. అలాగే డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేశారు. అప్పట్లో ఇవి పెద్ద ట్రెండ్ అయ్యాయి.

* రూ.10కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.70కోట్ల గ్రాస్‌తో రూ.40కోట్ల షేర్‌ సాధించి ఆల్‌ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story