శ్రీదేవి చెల్లెలు శ్రీలత గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

శ్రీదేవి చెల్లెలు శ్రీలత గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి శ్రీదేవి. అయితే ఆమెకి ఓ చెల్లెలు ఉందని అందరికీ తెలుసు.

అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి శ్రీదేవి. అయితే ఆమెకి ఓ చెల్లెలు ఉందని అందరికీ తెలుసు.. ఆమె మహేశ్వరిని పొరపడుతుంటారు. కానీ మహేశ్వరి కజిన్ కాగా, శ్రీదేవి సొంత చెల్లెలు పేరు శ్రీలత.. శ్రీలత గురించి పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శ్రీదేవి.. తనకి బెస్ట్ ఫ్రెండ్ శ్రీలత అంటూ తెలిపారు. శ్రీలత అంటే శ్రీదేవికి ప్రాణం. శ్రీదేవి ముంబై వెళ్ళేవరకు ఇద్దరు చెన్నైలోనే కలిసి ఉన్నారు.

షూటింగ్ లకి వెళ్లోచ్చిన తర్వాత శ్రీలతతో మాట్లాడకపోతే శ్రీదేవికి అస్సలు నిద్ర కూడా పట్టేది కాదట. ఇద్దరు రోజుకు డజన్ సార్లు అయిన కొట్టుకునేవాళ్లట. అవుట్ డోర్ షూటింగ్ లకి వెళ్ళినప్పుడు తనకోసం ఏమైనా తీసుకురాకపోతే శ్రీలత అలిగేవారట శ్రీదేవికి సినిమాలంటే ఇష్టం ఉంటే.. శ్రీలతకి నవలలు చదవడం అంటే ఇష్టం. చదివే ప్రతి నవలను అక్కతో పంచుకునేవారు. ఇక సినిమా షూటింగుల దగ్గరికి వెళ్లడం శ్రీలతకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ శ్రీదేవి బలవంతంగా తీసుకెళ్ళేవారట.

శ్రీలత శ్రీదేవి కలిసి ఓ సినిమాలో కలిసి నటించారు. అయితే ఆ సినిమాలో శ్రీ‌ల‌త‌ను ఒకామె కొట్టే సీన్ ఉంటుంది. అయితే శ్రీలతతో పాటుగా అమెకి కూడా అదే సినిమా మొదటి సినిమా కావడంతో శ్రీలతను గట్టిగా చెంపమీద కొట్టడంతో ఆమె వెక్కివెక్కి ఏడ్చిందట.. ఆ సమయంలో పక్కనే ఉన్న శ్రీదేవి తట్టుకోలేకపోయిందట. ఇక శ్రీలత సంజ‌య్ రామ‌స్వామి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

వివాహం అనంతరం శ్రీదేవి, శ్రీలతకి ఆస్తి తగాదాలు వచ్చాయి. దాదాపు పదేండ్ల పాటు వీరి మధ్య మాటలు లేవు. మళ్ళీ బోనికపూర్ చొరవతో ఇద్దరు ఒక్కటయ్యారు. శ్రీదేవి చనిపోయినప్పుడు శ్రీలత కూడా ముంబైలోనే ఉంది.

Tags

Next Story