ఎన్టీఆర్ 'సింహాద్రి' ప్రభంజనం ముందు తట్టుకొని నిలబడ్డ హీరో..!

ఎన్టీఆర్ సింహాద్రి ప్రభంజనం ముందు తట్టుకొని నిలబడ్డ హీరో..!
ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ అనేవి కొన్ని ఉంటాయి. అవి హీరో-హీరోయిన్ అవ్వొచ్చు.. హీరో- డైరెక్టర్ అవ్వొచ్చు.

ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ అనేవి కొన్ని ఉంటాయి. అవి హీరో-హీరోయిన్ అవ్వొచ్చు.. హీరో- డైరెక్టర్ అవ్వొచ్చు. అలాంటి క్రేజీ కాంబినేషన్‌‌లో ఎన్టీఆర్- రాజమౌళి ఒకటి. వీరి కాంబినేషన్‌‌లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా అటు ఎన్టీఆర్‌‌కి మాస్ హీరోగా, రాజమౌళికి స్టార్ డైరెక్టర్‌‌గా పేరు తీసుకొచ్చింది ఈ సినిమా. ఇది వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా. 2003 జులై 9న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌‌ని షేక్ చేసింది.

ఎన్టీఆర్ ఊర మాస్ యాక్టింగ్, రాజమౌళి టేకింగ్, కీరవాణి మ్యూజిక్ సినిమా సక్సెస్‌‌లో కీ రోల్ పోషించాయి. 55 కేంద్రాల్లో ఈ సినిమా డైరెక్ట్‌‌గా175 రోజులు పైగా నడిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ఎఫెక్ట్ కొన్ని సినిమాల పైన పడింది. అందులో కొన్ని సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. కానీ సింహాద్రి ప్రభావన్ని తట్టుకొని సోలో హీరోగా హిట్ కొట్టాడు వేణు తొట్టెంపూడి.

సింహాద్రి విడుదలై ప్రభంజనం సృష్టిస్తున్న సమయంలో సరిగ్గా తొమ్మిది రోజులకి(జులై18)న తన సినిమా కళ్యాణ రాముడు సినిమా రిలీజ్ అయింది. జి. రాంప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎస్పీ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. నిఖిత హీరోయిన్ గా నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు. ఎన్టీఆర్ సింహాద్రి సినిమా ప్రభంజనంలో కూడా ఈ సినిమా ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ సాధించింది. మలయాళ మూవీకి ఈ సినిమా రీమేక్ కావడం విశేషం.ఎన్టీఆర్ సింహాద్రి ప్రభంజనం ముందు తట్టుకొని నిలబడ్డ హీరో..!

Tags

Read MoreRead Less
Next Story