Aadi Saikumar : ఈవిడే ‘శంబాల’హీరోయిన్ స్వాసిక

Aadi Saikumar :  ఈవిడే ‘శంబాల’హీరోయిన్ స్వాసిక
X

లబ్బర్ పండు, పొరింజు మరియం జోస్, సత్తై, అయలుం నానుమ్ తమ్మిల్, ఇష్క్, శుభరాత్రి, వాసంతి, ఆరాట్టు, సీబీఐ 5, కుమారి వంటి తమిళ, మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక. ఎన్నో హిట్ మూవీస్ తో ఆకట్టుకున్న స్వాసిక ఫస్ట్ టైమ్ తెలుగు ప్రేక్షకులక పరిచయం కాబోతోంది. ఆది సాయి కుమార్ హీరోగా సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల ఏ మిస్టిక్ వరల్డ్’లో స్వాసిక హీరోయిన్‌ గా నటిస్తోంది.

శంబాలకు రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలు. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి హీరోయిన్ స్వాసిక ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎరుపు రంగు చీరలో స్వాసిక కనిపించిన తీరు.. ఆమె చూపులు, చుట్టూ ఉన్న వాతావరణం, ఆ పక్షి, దిష్టిబొమ్మ ఇలా అన్ని మూవీపై ఇంట్రెస్ట్ పెంచేలా ఉన్నాయి.

ప్రస్తుతం స్వాసిక సూర్య 45వ చిత్రంలో నటిస్తోంది. నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు చిత్రంలోనూ ఓ కీ రోల్ చేస్తోంది. శంబాల చిత్రం ఓ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రాబోతోంది. ఈ మూవీలో ఆది సాయి కుమార్ ఫిజిక్స్ సైంటిస్ట్ గా ఓ ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించబోతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ హైలెట్ అవుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో శంబాల సినిమాను చిత్రీకరిస్తున్నారు.

Tags

Next Story