ఈడీ ఆఫీస్‌లో కొనసాగుతున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణ..!

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ మొదలు పెట్టింది.. ముందుగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఎంక్వైరీ స్టార్ట్ చేసింది.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. తన కుమారుడు, న్యాయవాదితో కలిసి ఈడీ ఆఫీస్‌కు వచ్చారు పూరీ జగన్నాథ్. మొత్తం ఈ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇవ్వగా.. విచారణ ఎదుర్కొంటున్న మొదటి వ్యక్తి పూరీ జగన్నాథ్. 2017లో విచారణ సందర్భంగా ఎక్సైజ్ అధికారుల ముందు ఆయన హాజరయ్యారు.
తాజాగా పూరీ జగన్నాథ్‌ను ఈడీ విచారణ అధికారి ప్రశ్నిస్తున్నారు. పలు కోణాల్లో ప్రశ్నలు సంధిస్తున్నారు. డ్రగ్స్ లావాదేవీల్లో జరిగిన మనీల్యాండరింగ్‌పైనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. యాక్టర్ నవదీప్‌కు చెందిన ఎఫ్-క్లబ్ పబ్ నుంచి పూరీకి డ్రగ్స్ అందినట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో బయటకు వచ్చింది. డ్రగ్స్ కొనుగోళ్ల కోసం ఫెమా నిబంధనలు ఉల్లంఘించి.. పెద్దమొత్తంలో విదేశాలకు నిధులు మళ్లించినట్టు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. దీంతో ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు అధికారులు.
ఇవాళ పూరీ విచారణ జరుగుతుండగా, సెప్టెంబరు 2న ఛార్మిని అధికారులు విచారించనున్నారు.. సెప్టెంబర్ 22 వరకు సినీ ప్రముఖుల విచారణ జరగనుంది.6న రకుల్ ప్రీత్‌సింగ్, 8న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్-క్లబ్ పబ్ జనరల్ మేనేజర్, 15న ముమైత్‌ఖాన్, 17న తనీష్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com