Invicibles: ఇన్విజిబుల్స్ సీజన్-2 ట్రైలర్ విడుదల

Invicibles: ఇన్విజిబుల్స్ సీజన్-2 ట్రైలర్ విడుదల

Invicibles Season-2: విమర్శకుల ప్రశంసలు పొందిన సూపర్ హీరో సిరీస్ 'ఇన్విన్సిబుల్(Invicibles)' మేకర్స్ శనివారం రెండవ సీజన్ టీజర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

US-ఆధారిత మీడియా సంస్థ అయిన వెరైటీ రిపోర్ట్ ప్రకారం, యానిమేటెడ్ సూపర్ హీరో సిరీస్ 2వ సీజన్ నవంబర్ 3న ప్రసారమవనుంది. 8 ఎపిసోడ్‌లలో సీజన్‌లోని మొదటి 4 ఎపిసోడ్‌లు మాత్రమే నంబర్ 3న రానుండగా, సీజన్ రెండవ సగం 2024 ప్రారంభంలో రానుంది.

2021 మార్చి నెలలో వచ్చిన ఇన్విజిబుల్స్ మొదటి సీజన్ విశేష ప్రేక్షకాదరణ పొందింది. దీంతో అమెజాన్‌ సీజన్-2, 3లను నిర్మించాలని తలపెట్టింది. మార్క్ గ్రేసన్ 18 యేళ్ల ఒక సాధారణ బాలుడి చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. అతని తండ్రి ఒక శక్తివంతమైన సూపర్‌హీరోగా ఉంటాడు. తనకు ఎదురయ్యే కష్టాలు, భయాలతో ఎలా తన జీవితాన్ని మలుచుకుంటాడో అనేదే ఈ వెబ్ షో.

శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) ప్యానెల్‌లో రాబోయే రెండవ సీజన్ టీజర్, ట్రైలర్, క్యారెక్టర్ వివరాలు వంటి వార్తలు వెల్లడయ్యాయి.

కామిక్-కాన్‌లో, సీజన్ 1 తర్వాత వెంటనే ప్రారంభమయ్యే సీజన్ 2, కామిక్స్ నుండి ప్రధానపాత్ర ఆంగ్‌స్ట్రోమ్ లెవీకి స్టెర్లింగ్ కె. బ్రౌన్ వాయిస్ ఇచ్చాడు. సీజన్ 2 కోసం, బెన్ స్క్వార్ట్జ్, కాలిస్టా ఫ్లోక్‌హార్ట్, డేవిడ్ డిగ్స్, పీటర్ కల్లెన్, క్లిఫ్ కర్టిస్, టటియానా మస్లానీ మరియు డేవిడ్ డిగ్స్‌లతో సహా దాదాపు ఇరవై మంది కొత్త వాయిస్ పెర్ఫార్మర్‌ చేయనున్నారు.

ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ.. ఇది చాలా సమస్యలతో కూడిన గంట వ్యవధి ఉన్న షో. ఇందులో చాలా పాత్రలు, సన్నివేశాలున్నాయి. ఇన్ని పాత్రలను ఎలా సమన్వయం చేయాలన్న దానిపై మేం తనమునకలై ఉన్నామన్నాడు.

సీజన్-2, సీజన్‌-3లకు ప్రొడక్షన్ సిబ్బంది కష్టపడి ఒక విధానం రూపొందించడంతో భవిష్యత్‌లో వచ్చే ఎపిసోడ్‌ల మధ్య ఎక్కువ వ్యవధి ఉండబోదని స్పష్టం చేశాడు.




Tags

Read MoreRead Less
Next Story