Ira Khan: యాక్టర్ కాదు డైరెక్టర్ అవుతా అంటున్న స్టార్ హీరో కూతురు..

Ira Khan (tv5news.in)
Ira Khan: మామూలుగా ఒకరు ఓ రంగంలో చాలా గుర్తింపు సాధించుకున్న తర్వాత వారి వారసులు కూడా అదే రంగంలో అడుగుపెట్టాలని కోరుకుంటారు. వారి వారసులు కూడా చిన్నప్పటినుండి వారి తల్లిదండ్రులను చూసి ఆ రంగంపై ఇష్టం పెంచుకుంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ స్టార్ హీరో కూతురు మాత్రం తన తండ్రిలాగా యాక్టర్ అవ్వాలనుకోవట్లేదని క్లారిటీ ఇచ్చేసింది.
బాలీవుడ్‌లో నెపోటిజంపై చాలా నెగిటివిటీ ఉంది. అయినా కూడా స్టార్ నటీనటుల వారసులు ఒక్కొక్కరిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతూనే ఉన్నారు. అదే బాటలో అమీర్ ఖాన్ కూడా తన కుమారుడిని 'మహారాజా' అనే చిత్రంతో హీరోగా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు. కానీ అమీర్ కూతురు మాత్రం యాక్టింగ్ అంటేనే ఇష్టం లేదంటోంది.
హీరోలు లేదా హీరోయిన్ల వారసులపై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు కూడా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. అయితే అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అదంతా చూసిన తర్వాత త్వరలోనే తాను హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది అనుకున్నారంతా.
ఇటీవల సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఐరా ఖాన్‌కు నటిగా మారే ఆలోచన ఉందా అని అడిగారు. దానికి సమాధానంగా ఐరా.. 'నేను సినిమాల్లోకి రావడం లేదు' అనే క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఐరా గతంలో ఓ నాటకానికి డైరెక్టర్‌గా వ్యవహరించింది. దీంతో తాను యాక్టర్ కాకుండా డైరెక్టర్ అవ్వాలనుకుంటోందేమో అని బాలీవుడ్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com