Adi Pinisetty : ఈ శబ్ధంతో ఆది కమ్ బ్యాక్ ఇస్తాడా

Adi Pinisetty   :  ఈ శబ్ధంతో ఆది కమ్ బ్యాక్ ఇస్తాడా
X

చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చినా హిట్ లేక వెనకబడిపోయాడు ఆది పినిశెట్టి. ఆయన తండ్రి రవిరాజా పినిశెట్టి పెద్ద దర్శకుడే ఒకప్పుడు. కానీ దర్శకుల కొడకులు హీరోలుగా రాణించడం కష్టం అన్న సెంటిమెంట్ ఉన్న టైమ్ లోనే ఆది కూడా వచ్చాడు. తర్వాత తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు కానీ వర్కవుట్ కాలేదు. ఈ క్రమంలో కొన్ని సినిమాల ద్వారా తనలోనూ మంచి నటుడు ఉన్నాడు అని నిరూపించుకున్నాడు. సరైనోడు, అగ్నాతవాసి వంటి చిత్రాల్లో విలన్ గానూ అదరగొట్టాడు. కొంత గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా 'శబ్ధం' అనే చిత్రంతో వస్తున్నాడు.

కొన్నేళ్ల క్రితం వైశాలి అనే వైవిధ్యమైన సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు ఆది. ఆ చిత్ర దర్శకుడు అరివళగనే ఈ చిత్రానికీ దర్శకుడు. లక్ష్మి మీనన్ ఫీమేల్ లీడ్ లో నటించింది. ఈ మూవీకి సంబందించిన ప్రతిదీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూసిన చాలామంది మైండ్ బ్లోయింగ్ అనేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని చూసిన కొందరు తమిళ్ జర్నలిస్ట్స్ అవుట్ స్టాండింగ్ అనేస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలవుతున్న శబ్ధం హీరోగా ఆదికి మంచి సౌండింగ్ బ్రేక్ ఇస్తుందంటున్నారు.

నిజానికి ఆది కొన్ని రకాల పాత్రలకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. ఆ పాత్రల్లోనే హీరోయిక్ కథలు సెలెక్ట్ చేసుకుంటే బావుండేది. మధ్యలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లడం ద్వారా ఇబ్బంది పడ్డాడు. ఈ తరహా కంటెంట్ బేస్డ్ మూవీస్ లో అతను అదరగొట్టే ఛాన్స్ ఉంది. అందుకే శబ్ధం ఆదికి మంచి బ్రేక్ ఇస్తుందంటున్నారు చాలామంది. మరి ఈ మూవీతో అతను హీరోగా కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

Tags

Next Story