Adivi Sesh : అడివి శేష్ సెటైర్స్ చిరంజీవి, నాని పైనేనా..?

కొన్నిసార్లు యధాలాపంగా అన్న మాటలు విమర్శలకు గురవుతాయి. వాళ్లు క్యాజువల్ గానే అంటారు. కానీ చూసే వారికి ఎవరినో టార్గెట్ చేసినట్టుగానో.. లేక ఎవరిపైనో సెటైర్ వేసినట్టుగానే అనిపించడం కూడా అంతే క్యాజువల్ గా జరుగుతుంది. తాజాగా అడివి శేష్ లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడాడు. సినిమాను పొగిడాడు. తనకు నచ్చిందన్నాడు. అంతవరకు ఓకే. కానీ ఒక సందర్భంలో అతను.. ‘ మీ అందరికీ తెలుసు.. నేను కొంచెం కటింగ్ లు ఇచ్చే రకం కాదు. నేను ఏ రోజు కూడా ఒక డైరెక్టర్ హిట్ కొట్టాడని చెప్పి.. అతన్ని ఇంటికి పిలిచి డిన్నర్ పెట్టి.. నెక్ట్స్ మనం సినిమా చేయాలి, నాకు కాల్షీట్లు ఇయ్యాలి.. ఇలా ఎప్పుడు మాట్లాడలేదు నేను.. ’ అన్నాడు. మామూలుగా అది నిజంగానే అతని మైండ్ సెట్ కావొచ్చు. కానీ అలా చేసే వారు ఆటో మేటిక్ గా హర్ట్ అవుతారు కదా.
ఇండస్ట్రీలో ఎవరైనా హిట్ కొడితే వారిని ఇంటికి పిలిచి డిన్నర్ పెట్టినా పెట్టకపోయినా మనస్ఫూర్తిగా అభినందిస్తాడు చిరంజీవి. అలాగే మంచి కథలు ఉంటే చెప్పమని కూడా అడుగుతాడు. ఇలాగే నాని సైతం అదే చేస్తాడు. ఎవరైనా మంచి హిట్ కొడితే వారిని అభినందిస్తాడు. మంచి కథలు ఉంటే చేద్దాం అంటాడు. ఇలా చేయడం తప్పేం కాదు. కానీ దీన్ని కటింగ్ లు ఇవ్వడం వంటి మాటతో శేష్ పోల్చడమే ఈ పోలికలకు కారణం అయింది.
ఏదేమైనా శేష్ నిజంగానే యధాలాపంగా అనేసి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు ఇవే ట్రిగ్గర్ అవుతాయి. తెలియకుండానే అది కాంట్రవర్శీ అవుతుంది. మరి దీనిపై మిగతా హీరోల ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com