OMG 2 : అడల్ట్ సర్టిఫికేట్ పై డీప్ గా డిసప్పాయింట్ అయిన అక్షయ్ కుమార్

OMG 2 : అడల్ట్ సర్టిఫికేట్ పై డీప్ గా డిసప్పాయింట్ అయిన అక్షయ్ కుమార్
'ఓ మై గాడ్' కు A సర్టిఫికెట్ పై అక్షయ్ వ్యంగ్య వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి నటించిన ఓ మై గాడ్ 2(OMG 2). ఈ చిత్రం సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో దేవుడు, మతం గురించిన ఇతివృత్తాలతో సహా సున్నితమైన కథాంశం కారణంగా, ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో పలు సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత ఎలాంటి కోతలు లేకుండా బోర్డు ఆమోదించింది. కానీ సీబీఎఫ్సీ (CBFC) (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) నుండి అడల్ట్ రేటింగ్ పొందింది. ఇప్పుడు ఇదే విషయంపై అక్షయ్ కుమార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

OMG 2.. A సర్టిఫికేట్ పొందడంపై అక్షయ్ కుమార్ స్పందన...

OMG 2 చూసిన తర్వాత ప్రజల స్పందనను తెలుసుకునేందుకు ఇటీవల అక్షయ్ కుమార్, మూవీ టీం.. ముంబైలోని ఒక థియేటర్‌ని సందర్శించారు. సినిమా ప్రదర్శన తర్వాత, ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి ప్రేమకు ధన్యవాదాలు తెలిపాడు. సినిమా గురించి వారితో ఇంటరాక్ట్ అయ్యాడు. "(కమల్ కీ బాత్ బటౌన్, పెహ్లీ అడల్ట్ ఫిల్మ్ హై జో టీనేజర్స్ కే లియే బనీ హై ) తమాషా ఏమిటంటే ఇది యుక్తవయస్కుల కోసం రూపొందించిన మొదటి అడల్ట్ ఫిల్మ్" అని అతను CBFCని వ్యంగ్యంగా దూషించాడు. ఈ చిత్రానికి అడల్ట్ రేటింగ్ రావడంపై తన నిరుత్సాహాన్ని కూడా వ్యక్తం చేశారు. యూనివర్సల్ ఆడియెన్స్ దీన్ని చూసి నేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

OMG 2 గురించి..

OMG 2 కి అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇది 2012 లో విడుదలైన.. పరేష్ రావల్ నటించిన హిట్ చిత్రం ఓహ్ మై గాడ్ కు సీక్వెల్. ఇప్పుడు రెండవ భాగంగా వస్తోన్న ఈ సినిమాలో అక్షయ్.. శివుని పాత్రను పోషిస్తుండగా, పంకజ్ త్రిపాఠి తన కొడుకు కోసం పోరాడే తండ్రిగా నటించాడు. యామీ గౌతమ్ కోర్టులో అతనిని వ్యతిరేకించే న్యాయవాదిగా నటించారు. ఈ చిత్రం కథ, నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. రిలీజ్ సైజు, అడల్ట్ సెన్సార్ సర్టిఫికేట్ మూవీ వసూళ్లను గణనీయంగా ప్రభావితం చేశాయి. ఇది గదర్ 2తో పాటు ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ఇప్పటికే రెండు రోజుల్లోనే రూ. 23 కోట్ల కలెక్షన్‌లను రాబట్టింది. కేవలం నోటి మాట ద్వారానే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది.


Tags

Read MoreRead Less
Next Story