Allu Arjun పుష్ప 2 ఆగిపోయిందా..?

Allu Arjun పుష్ప 2 ఆగిపోయిందా..?
X
దర్శకుడు సుకుమార్ తో పాటు నిర్మాణ సంస్థ మైత్రీ వాళ్ల వైఖరికి విసిగిపోయిన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ నుంచి తప్పుకున్నాడనీ,, అందుకే గడ్డం కూడా తీసేశాడు అని.. అసలు ఈ ప్రాజెక్టే ఆగిపోయింది అని వస్తోన్న వార్తల వెనక వాస్తవాలేంటీ..?

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పుష్ప 2 గురించి మూడు నాలుగు రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆగస్ట్ 15న ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేస్తాం అన్న హామీతో సాగిన షూటింగ్ ఏ దశలోనూ ఆ దిశగా చిత్రీకరణ జరుపుకోలేదని.. దీంతో మరో నెల రోజులకు పైగా షూటింగ్ పెండింగ్ లో ఉందని డిసెంబర్ కు వాయిదా వేశారు. సరిగ్గా దీనికి ముందు అల్లు అర్జున్ పొలిటికల్ ఇష్యూస్ లో చిక్కుకున్నాడు. దీంతో ఆ కారణంగానే వాయిదా వేశారు అన్నసెటైర్స్ కూడా పడ్డాయి. బట్ ఈ వారం నుంచీ వినిపిస్తోన్న వార్తలు చూస్తే మాత్రం ఖచ్చితంగా పుష్ప 2 కు సంబంధించి ఏదో జరగుతోందన్నది అర్థం అవుతోందంటున్నారు చాలామంది. అందుకు కారణం.. తాజాగా అల్లు అర్జున్ తన గడ్డం తీసేసి కనిపించడమే.

అల్లు అర్జున్ వీలైనంత వేగంగా ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసి తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై కాన్ సెంట్రేట్ చేయాలని ప్రయత్నంలో ఉన్నాడు. కానీ సుకుమార్ చాలా స్లోగా చిత్రీకరిస్తున్నాడట. ఐకన్ స్టార్ సపోర్ట్ చేసినా అతను తను అనుకున్నట్టుగానే కనిపిస్తున్నాడనే న్యూస్ వచ్చాయి. అదే నిజమైందని ఈ గడ్డం లేని ఫోటోస్ చూపిస్తూ జనం చెప్పుకుంటున్నారు. సుకుమార్ తో పాటు నిర్మాణ సంస్థ వైఖరితో అల్లు అర్జున్ విసిగిపోయాడని .. అందుకే గడ్డం తీసేసి విదేశాలకు వెకేషన్ కు వెళ్లాడంటున్నారు. అయితే ఇప్పటి వరకూ అల్లు అర్జున్ విషయాన్ని పెద్దగా పట్టించుకోని నిర్మాణ సంస్థ ఇప్పుడు హడావిడీగా డామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోందట. బట్ లేట్ అయింది. ఆల్రెడీ బన్నీ గడ్డం తీసేశాడు. తీస్తే మళ్లీ పెరగదు అని కాదు. కానీ.. కొన్నాళ్ల పాటు షూటింగ్ ఆగిపోతుంది. అది ఇతర కాల్షీట్స్ పై ప్రభావం చూపుతుంది. ఒకవేళ మళ్లీ షూటింగ్ కు వెళ్లాలంటే ఖర్చులు మరింత పెరుగుతాయి.

అదే టైమ్ లో ఇప్పటి వరకూ వచ్చిన అవుట్ పుట్ పై కూడా హీరో అంత సంతృప్తిగా లేడని.. అందుకే మొత్తంగానే ప్రాజెక్ట్ ను ఆపేస్తున్నారనే టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజా నిజాలేంటన్నది క్లియర్ గా తెలియదు కానీ.. ఇప్పటికైతే పుష్ప 2 ఆగిపోయినట్టే అంటున్నారు. అంటే ఇప్పటి వరకూ ఉన్న ఇష్యూస్ ను సార్ట్ అవుట్ చేసుకుని మళ్లీ సెట్స్ లోకి వెళతారా లేక ఇప్పటి వరకూ వేసిన సెట్స్ కూడా పీకేసి ఎవరి ఈగోకు తగ్గట్టుగా వాళ్లు వేరే ప్రాజెక్ట్స్ కు షిఫ్ట్ అవుతారా అనేది తేలాల్సి ఉంది.

Tags

Next Story