Andhra King Taluka : సినిమా హిట్, ఓపెనింగ్స్ ఫట్

రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా ఆంధ్రాకింగ్ తాలూకా. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈ మూవీతో రామ్ ఓ బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారెంటీ అనిపించింది. అది నిజమే కానీ మూవీపై పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూస్ బావున్నాయి. కంటెంట్ పరంగా అప్లాజ్ కూడా వస్తోంది. బట్ ఓపెనింగ్స్ పరంగా చూస్తే మాత్రం దారుణంగా ఉన్నాయి అనే టాక్ ఉంది. రామ్ కెరీర్ లో ఇలాంటి మూవీ ఇప్పటి వరకు తీయలేదు అనే అనేది చాలామంది చెబుతున్నారు. కానీ మూవీ పరంగా చూస్తే ఓపెనింగ్స్ విషయంలో మాత్రం వీక్ గా కనిపిస్తోంది.
నిజానికి ఆంధ్రాకింగ్ తాలూకా కంటెంట్ పరంగా చూస్తే కొన్ని మైనస్ లు ఉన్నాయి. నెగెటివ్ రివ్యూవర్స్ ఈ విషయాన్ని హైలెట్ చేయడం దారుణం. మామూలుగా చిన్న చిన్న మైనస్ లు కనిపించడం అన్ని సినిమాల్లోనూ ఉండేదే. కానీ ఆంధ్రాకింగ్ తాలూకా విషయంలో మాత్రం కాస్త ఎక్కువగా చేయడం అనేది కావాలని చేస్తున్న అంశమే.
ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా వీక్ ఉంది. బట్ నెక్ట్స్ డే వరకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. రివ్యూస్ పాజిటివ్ ఎక్కువగా కనిపించడం మాత్రం పెద్ద ప్లస్ అవుతోంది. అయితే మొదటి రోజు వీక్ గా కనిపించిన చిత్రాలే తర్వాతి రోజుల్లో వీక్ ఉండటం అనే ట్రెండ్ కూడా మొదలైంది. ఫస్ట్ డే వసూళ్లు బాలేదు కాబట్టి నెక్ట్స్ డే ఫర్వాలేదు అనిపించేలా కనిపించడం లేదు. ఎలా చూసినా రామ్ మూవీ సినిమా మాత్రం హిట్ అనిపించుకుంది. బట్ ఓపెనింగ్స్ మాత్రం బాలేదు అనిపించుకుంది. దాన్ని దాటుకుని ఓపెనింగ్స్ పుంజుకోవడం మీదే సినిమా విజయం ఆధారపడి ఉంటుందనేది నిజం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

