Allu Arjun : అట్లీ అందుకే అల్లు అర్జున్ ను లైట్ తీసుకున్నాడా

Allu Arjun :  అట్లీ అందుకే అల్లు అర్జున్ ను లైట్ తీసుకున్నాడా

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ మూవీ చేయబోతున్నాడు అని చాలా కాలంగా వార్తలు వచ్చాయి. ఇంకా చెబితే పుష్ప తర్వాత అతనితోనే అనుకున్నారు. బట్ పుష్ప 2 వస్తోంది. ఈ మూవీ తర్వాతైనా అట్లీ డైరెక్షన్ లో సినిమా ఉంటుందా అనుకుంటే ఆల్మోస్ట్ లేదు అనే తేలిపోయింది. నిజానికి కొన్నాళ్ల క్రితం అట్లీ హైదరాబాద్ కు వచ్చి అల్లు అర్జున్ ను కలిసి కథ చెప్పాడు కూడా. మరి ఏమైందో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిపోయింది. ఇండస్ట్రీలో ఆగిపోయిన సినిమాలను అలా చెప్పరు కదా.. హోల్డ్ లో ఉంది అంటారు.

అయితే అందరూ అల్లు అర్జున్ కే కథ నచ్చలేదు అనుకున్నారు. బట్ మేటర్ వేరే ఉంది. అట్లీకి ఐకన్ స్టార్ కు మించిన స్టార్స్ దొరికారు. అతను ఎప్పటి నుంచో సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఆ మధ్య వెళ్లి కథ చెప్పాడు. సల్లూ భాయ్ విపరీతంగా నచ్చి ఓకే చెప్పాడు. పైగా అట్లీ కేపబిలిటీ ఏంటో అదే బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో చేసిన జవాన్ ప్రూవ్ చేసింది కదా. జవాన్ 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలాంటి మాస్ మసాలా కథనే సల్మాన్ కు చెప్పాడు అంటున్నారు. అయితే ఈ మూవీలో మరో హీరో కూడా ఉంటాడట. ఆ పాత్ర కోసం కమల్ హాసన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం అట్లీ కమల్ ను కలిసి స్టోరీ నెరేట్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. కథ, తన పాత్ర నచ్చితే కమల్ ఇలాంటి రోల్స్ చేయడానికి ఏ మాత్రం వెనకాడడు. ఒకవేళ కమల్ ఓకే అంటే మాత్రం ఇది ఇండియాలోనే మరో భారీ మల్టీస్టారర్ అవుతుంది. మరి అలాంటప్పుడు పుష్పరాజ్ కోసం ఎందుకు చూస్తాడు అట్లీ. సో.. అదీ మేటర్.. అల్లు అర్జున్ నో చెప్పలేదు. అట్లీనే అంతకు మించిన స్టార్స్ ను సెట్ చేసుకున్నాడు.

Tags

Next Story